అవును.. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొంత కాలంగా కీర్తి అనిరుద్ తో డేటింగ్‌లో ఉందని.. ఇక తాజాగా ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యేందుకు రెడీ అవుతున్నరనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అయితే కీర్తి సురేష్ పెళ్లి పై రూమర్లు రావడం ఇదేం మొదటి సారి కాదు.. ఇంతకు ముందే ఓ బిజినెస్ మ్యాన్ తో కీర్తి ఎంగేజ్ మెంట్ అయిందని న్యూస్ రాగా.. ఆ తరువాత ఓ బీజేపీ నాయకుడి కొడుకుతో పెళ్లి కి అంతా సిద్దమంటూ.. మరో రూమర్ వచ్చి హంగామా చేసింది. ఇలా రూమర్లు మహానటి పెళ్లి చుట్టూనే తిరిగాయి. ఇలా ఓ వైపు కీర్తి సురేష్ వివాహం అంటూ సందడి చేసేస్తుంటే.. తను మాత్రం ఇదేమీ తనకు పట్టనట్లు కూల్ గా సినిమాలను చేసుకుంటుంది. ఇప్పటికే సన్నబడి సరికెత్త లుక్లోకి మారిన కీర్తి.. మహేష్ సర్కారీ పాటలో ఛాన్స్ కొట్టేసి.. దుబాయ్‌లో మహేష్‌తో ఆడిపాడుతోంది. ఈ ఒక్క సినిమానే కాదు.. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు లైన్లో పెట్టి బిజీబిజీగా ఉందీ అమ్మడు. మరోవైపు అనిరుద్ ప్రముఖ గాయని జోనీతాగాంధీ ప్రేమలో మునిగితేలుతున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ పెళ్లి ఊహాగానాలపై కీర్తి సురేష్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి
కీర్తి అనిరుధ్‌లకు పెళ్లి?
Related tags :