తెలంగాణలో ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల రాజకీయ పార్టీ ఉహాగానాలపై ఆ రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.
షర్మిల ఎవరి బాణం కాదని ఏపీలో ఏం చేయలేకనే ఇక్కడకు వచ్చారని ఎద్దేవా చేశారు.
పరాయి నేతలు వద్దు అనే ఉద్దేశంతోనే సొంత రాష్ట్రం తెచ్చుకున్నామని మంత్రి స్పష్టం చేశారు.
చిరంజీవి, పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీలు పెట్టారు ఏమైందో ప్రజలు చూశారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ పథకాలను దేశమే కాపీ చేస్తోందని, ఎవరు వచ్చినా ఇబ్బంది లేదని అన్నారు.
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి మరణించి ఏళ్లు గడిచిపోయిందని గుర్తు చేశారు.
షర్మిల పార్టీపై స్పందించిన మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆంధ్రా పార్టీలను తెలంగాణ ప్రజలు రానివ్వబోరని స్పష్టం చేశారు.
భాజపా దేశ వ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇవ్వలేదని ఆరోపించారు. రైతు ఉద్యమానికి తెరాస మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు