Politics

అజిత్ ఢోభాల్ ఇంటిపై ఉగ్రవాదుల కన్ను-తాజావార్తలు

అజిత్ ఢోభాల్ ఇంటిపై ఉగ్రవాదుల కన్ను-తాజావార్తలు

* జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ఆయన ఇంటిపై రెక్కి నిర్వహించినట్లు పోలీసుల కస్టడీలో ఉన్న ఓ ఉగ్రవాది బయటపెట్టాడు. దీంతో ఢోబాల్‌ నివాసం, కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

* తన నివాసం బయట బీఎస్‌ఎఫ్‌ జవాన్లను మోహరించడంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే వారిని ఉపసంహరించుకోవాలని కోరుతూ దిల్లీ పోలీసులకు లేఖ రాశారు. సాయుధ జవాన్ల కదలికలు చూస్తుంటే తనపై నిఘా ఉంచినట్టు అనిపిస్తోందంటూ దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌ఎన్‌ శ్రీవాస్తవకు రాసిన లేఖలో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4.30గంటల సమయంలో తన అధికారిక నివాసానికి ఎస్‌హెచ్‌వో వచ్చారనీ.. ఆ తర్వాత రాత్రి 10గంటల సమయంలో ముగ్గురు సాయుధ బీఎస్‌ఎఫ్‌ అధికారులను ఇంటి బయట ఉంచినట్టు లేఖలో తెలిపారు. తనకు భద్రత కోసమే వచ్చినట్టు జవాన్లు చెబుతున్నారని పేర్కొన్నారు.

* తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ నటుడు దివంగత నందమూరి తారక రామారావు రాజకీయ జీవితంపై పాత్రికేయుడు రమేశ్ కందుల రాసిన ‘మేవరిక్‌ మెస్సయ: ఏ పొలిటికల్‌ బయోగ్రఫీ ఆఫ్‌ ఎన్‌టీ రామారావు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 18న జరగనుంది. ఈ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించనున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 33,415 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 54 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ వల్ల గడిచిన 24 గంటల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,88,814కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,162కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 71 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,80,855కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 797 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,35,17,440 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

* చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం కోళ్లబైలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ పెట్టెలను గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని బైరెడ్డి కాలనీకి తరలించేందుకు ఎన్నికల అధికారులు యత్నించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, ఇంటర్నెట్‌ సమస్య కారణంగా బ్యాలెట్‌ బాక్సులు మరోచోటుకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగితపు బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపునకు అంతర్జాలం ఎందుకని అధికారులతో గ్రామస్థులు వాదనకు దిగారు. ఎప్పటిలాగే తమ గ్రామంలోనే కౌంటింగ్‌ జరపాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఇప్పటికీ అక్కడ కౌంటింగ్‌ మొదలు కాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లె డీఎస్పీ పరిస్థితిని సమీక్షించి గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సాధ్యమైనంత తొందరగా కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేలా ఎన్నికల అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.

* కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో ప్రసంగించిన ఆయన.. సరైన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదన్నారు. రాష్ట్ర హోదా ఇవ్వబోమని ఈ బిల్లులో ఎక్కడా లేదని, దీనిపై విపక్షాలు వక్రభాష్యాలు చెబుతున్నాయంటూ మండిపడ్డారు. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్‌ ఏంచేసిందని ప్రశ్నించారు. హింస, అశాంతితో కూడిన పాత రోజులు కశ్మీర్‌లో మళ్లీ రావన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అధికార పంపిణీ జరుగుతోందన్నారు. పంచాయతీలకు పరిపాలన, ఆర్థికపరమైన అధికారాలు కల్పించినట్టు తెలిపారు. జమ్మూకశ్మీర్‌పై ప్రతి అంశానికీ వివరణ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

* తెలంగాణ గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రోడ్ల మీద పడి అరిచినంత మాత్రాన తెలంగాణ రాలేదని.. చట్టసభల్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని వారు మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాలలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో తెరాసపై తనదైన శైలిలో భట్టి విమర్శలు చేశారు. తెలంగాణపై మాట్లాడే హక్కు కేవలం కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. నిత్యం అబద్ధాలాడుతూ ప్రజలను దోచుకుంటున్నారని.. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని భట్టి హెచ్చరించారు. 2024లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని భట్టి వెల్లడించారు.

* ఆ గ్రామానికి ఆయన మాటే వేదం. ఎంత పెద్ద సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తారు. పోలీసులు ఆ ఊరి వైపు రారు. గ్రామస్థులూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లరు. 1959లో గ్రామానికి మొదటి సర్పంచిగా గెలిచి 1972 వరకు ఏకగ్రీవంగా నిలిచి.. ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయనే నెల్లూరు జిల్లా నారంపేట గ్రామానికి చెందిన శ్రీహరి నాయుడు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఎన్నికలు జరుగుతున్నాయి.

* పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్న వనజీవి రామయ్యను ఆయన కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రామయ్యను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. వైద్యుల సూచన మేరకు ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంజీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వనజీవి రామయ్యకు గతంలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగింది.

* రాజధాని అమరావతి, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చించినట్టు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజధాని అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రధానికి వివరించా. రాజధానిలో ఇప్పటికే రూ.50 వేల కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉంది. అమరావతి రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజధాని మార్చాలంటే రూ.లక్ష కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. న్యాయపరంగా పోరాడుతున్నాం… మీ మద్దతు కూడా కావాలని ప్రధానిని కోరా. ఆయన సానుకూలంగా స్పందించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సెంటిమెంట్‌, ఆంధ్రుల మనోభావాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లా. అన్ని అంశాలను పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని ప్రధాని అన్నారు. విశాఖ వాసుల సెంటిమెంట్‌ను ప్రధాని కాపాడుతారని నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడులపై 25 పేజీల నోట్‌ను ప్రధానికి అందజేశా. వ్యవసాయ చట్టాలపై కూడా కొన్ని సూచనలు చేశాను. సీఎం జగన్‌ కూడా పార్టీ ఎంపీలతో ప్రధాని మోదీని కలిసి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై విజ్ఞప్తి చేయాలి’’ అని రఘురామకృష్ణరాజు అన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. రెండో దశ పోలింగ్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో పోలింగ్‌ జరిగింది. వాటిలో 2,786 సర్పంచ్‌ స్థానాలు, 20,817 వార్డు స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. పలుచోట్ల తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాంటి చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్‌ కొనసాగింది. మొదటి దశలో మాదిరిగానే రెండో దశలోనూ ఓటర్లు ఓటు వేసేందుకు పోటెత్తారు. రెండో దశ ఎన్నికల్లో 81.67 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

* చెదురుమదురు ఘటనల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పలుచోట్ల తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మొదటి దశలో మాదిరిగానే రెండో దశలో కూడా ఓటర్లు పోటెత్తారు. తొలిదశ ఎన్నికల్లో భారీగా 81.42% పోలింగు నమోదైన విషయం తెలిసిందే. రెండో దశలో అదే విధంగా పోలింగ్‌ శాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం 6గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కార్యాలయంలో కమాండు కంట్రోల్‌ సెంటర్‌ నుంచి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలింగును కమిషనర్‌ గిరిజాశంకర్‌ పరిశీలిస్తున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. రెండో దశ పోలింగ్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో పోలింగ్‌ జరిగింది. వాటిలో 2,786 సర్పంచ్‌ స్థానాలు, 20,817 వార్డు స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. పలుచోట్ల తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాంటి చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్‌ కొనసాగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన 9 నెలల గర్భిణీ ఓటు వేసిన అనంతరం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకల్లు సర్పంచ్‌ అభ్యర్థి లీలా కనకదుర్గ రెండో విడత పోలింగ్‌లో భాగంగా ఈ ఉదయం ఓటు వేశారు. కొద్ది సేపటికే ఆమెకు నొప్పులు రావడంతో కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పండండి ఆడశిశువుకు జన్మనిచ్చారు.

* జీహెచ్ఎంసీ కొత్త మేయర్‌ విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ జంట నగరాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజెన్లు ఫొటోలు తీసి ట్విటర్‌లో పోస్టు చేయడంతో సంబంధిత అధికారులు స్పందించారు. జూబ్లీహిల్స్‌లో అనధికారికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తెరాస నేత అతీష్‌ అగర్వాల్‌కు రూ.లక్ష జరిమానా విధించారు.

* కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సీ) ఐదు రాష్ట్రాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) కింద అదనపు కేంద్ర సహాయాన్ని ఆమోదించింది. 2020లో వరదలు, తుఫాను, తెగులు దాడి వలన ప్రభావితమైన రాష్ట్రాలకు నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. కాగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది.

* కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభలో ప్రసంగించిన ఆయన.. సరైన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదన్నారు. రాష్ట్ర హోదా ఇవ్వబోమని ఈ బిల్లులో ఎక్కడా లేదని, దీనిపై విపక్షాలు వక్రభాష్యాలు చెబుతున్నాయంటూ మండిపడ్డారు. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్‌ ఏంచేసిందని ప్రశ్నించారు.

* ఆ గ్రామాల చుట్టూ నీళ్లుండి ఎప్పుడూ నిండుకుండలా కళకళలాడుతుంటాయి. కానీ వారికి చుక్క నీరు దక్కడం లేదు. ఆ నీరంతా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, తమకు ఎలాంటి ప్రయోజనం ఉడటంలేదని కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపూర్‌ కాలువ, వరద కాలువతోపాటు, నారాయణపూర్‌ జలాశయం నుంచి వచ్చే నీటికి సూపర్‌ ప్యాసేజీ నిర్మిస్తామన్న హామీతో భూములు అప్పగించిన తమకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయిందని వాపోతున్నారు.

* తమ కెరీర్‌లో ఒక్కసారైనా శంకర్‌తో సినిమా చేయాలని ఉవ్విళ్లూరే కథానాయకులు ఎంతోమంది ఉన్నారు. భారీదనానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే శంకర్‌ దర్శకత్వంలో నటించే అవకాశం యువ కథానాయకుడు రామ్‌చరణ్‌కు దక్కింది. శంకర్‌ తన మొదటి చిత్రం ‘జెంటిల్‌మెన్‌’ కోసం కథానాయకుడిగా చిరంజీవిని కూడా అనుకున్నారట. కానీ, అప్పటి పరిస్థితుల్లో అది సాధ్యపడలేదు. అయితే, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చిరు తనయుడితో శంకర్‌ పనిచేస్తుండటం విశేషం.

* నిరసన తెలిపే హక్కు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిరసన తెలిపే హక్కు అంటే ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ ఆందోళన చేయడం మాత్రం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో భాగంగా దిల్లీలోని షహీన్‌భాగ్‌ వద్ద ఆందోళనలు చేయడానికి వీళ్లేదంటూ గతేడాది సుప్రీం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

* సంపన్నులు, ఆశ్రిత పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్‌ తీసుకొచ్చిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గట్టిగా బదులిచ్చారు. తమకు మిత్రులంటే ఈ దేశ సామాన్య ప్రజలేనని, వారికోసమే బడ్జెట్‌ రూపొందించామని తెలిపారు. బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చకు శనివారం ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

* ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో శతకం బాదిన హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కఠినతరమైన పిచ్‌పై చేసిన ఈ సెంచరీకి ఎంతో విలువవుందని మాజీ క్రికెటర్లు అంటున్నారు. జట్టుకు తానెంతో కీలకమైన ఆటగాడినని హిట్‌మ్యాన్‌ నిరూపించుకున్నాడని పేర్కొంటున్నారు.