Editorials

గులాబీల పండుగ…ఫిబ్రవరి 14

గులాబీల పండుగ…ఫిబ్రవరి 14

రోజావే.. చిన్ని రోజావే అంటూ తన మదిలో కదిలే ప్రేమ భావాన్ని విరిసీ విరియని రోజా పువ్వతో వ్యక్తంచేసే ప్రియులు కోకొల్లలు. అందుకే వాలంటైన్స్‌డే వచ్చిందంటే రోజా పువ్వకు ఉండే గిరాకీ అంతాఇంతా కాదు. మహారాష్ట్ర, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ గులాబీ పువ్వులను విదేశాలకు దిగుమతి చేస్తుంటారు. ఓ చిన్ని పువ్వులో ఇంత ఘాటు ప్రేమ దాగివుంటుందేమో!వాలంటైన్స్‌డే వచ్చిందంటే ఏ గిఫ్ట్ ఇస్తాడా అని ఎదురుచేసే ప్రియురాళ్లు స్వీకరించే బహుమతుల్లో ప్రథమ స్థానం ఆనాటి నుంచి ఈనాటీ వరకూ పూలకే దక్కుతోంది. ఆరోజు పూలు ఇస్తే చాలు ఇట్టే ఐస్ అయిపోతారట. ఈ పూలల్లో కూడా గులాబీ అంటేనే ఎక్కువ ఇష్టపడతారని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.‘‘ మీరే పువ్వు కోరుకుంటున్నారని’’ ఆ సర్వేలో అడిగితే 4శాతం మంది అమ్మాయిలు గులాబీ పట్ల మక్కువ చూపారు. ఒక్క గులాబీ ఇచ్చినా చాలు మనసు ఆనందంతో నిండపోతుందని సమాధానం ఇచ్చారు. ఈ సర్వేలో పూలు కోరుకునే మహిళలే ఎక్కువ పాయింట్లు సాధించినట్లు వెల్లడైంది. వాలంటైన్స్‌డేకి కొద్దిరోజులు ముందే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌వారు గులాబీల ఎగుమతి చేస్తుంటారు. విదేశాలలో గులాబీలకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. మహారాష్ట్ర, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి గులాబీల ఎగుమతి అధికంగా జరుగుతోంది. ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసి మరీ ఎగుమతి చేస్తుంటారు. సతార, సంగ్లి, పూనే తదితర ప్రాంతాల నుంచి గులాబీల ఎగుమతి అమెరికా, జపాన్, యూరోపియన్, గల్ఫ్ దేశాలకు జరుగుతుంటుంది. వాలంటైన్స్‌డే నాటికి చేరేలా గులాబీలను, పళ్లు, కొన్ని రకాల కూరగాయలను సైతం ఎగుమతి చేస్తారు. వీటిలో గులాబీలదే ప్రథమ స్థానం. టన్నుల్లోనే సరఫరా అవుతాయి. ముంబాయి నుంచి ప్రతిరోజు 800-1200 కిలోల గులాబీలను మాత్రమే సరఫరా చేస్తారు. కాని వాలైంటెన్స్‌డే కోసం ప్రత్యేకంగా ముంబాయి నుంచి అమెరికా, యూరోప్, ఆసియా దేశాలకు ఎంతలేదన్నా 30టన్నులకు పైగా రోజా పువ్వులు ఎగుమతి అవుతాయి.బెంగుళూరు నుంచి గత ఏడాది 4మిలియన్ టన్నుల గులాబీలు ఎగుమతికాగా, ఈ ఏడాది ఐదు టన్నుల ఎగుమతి జరిగింది. బెంగుళూరులో ప్రత్యేకంగా వాలంటైన్స్‌డే కోసమే 250 హెక్టార్లలో పెంచుతారు.ఇక అబ్బాయిల విషయానికి వస్తే వీరు ఎక్కువగా తమకిష్టమైన అమ్మాయిలకు పూలతో పాటు కాన్వాస్ చిత్రాలు, గిఫ్ట్ బాస్కెట్స్ తదితరవాటని ఇవ్వటానికి ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడైంది. ఎంతలేదన్నా ముంబాయి, పూనేలాంటి మహానగరాల్లో యువకులు తమ ప్రియురాళ్ల కోసం ఐదువేల రూపాయలకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది. ఐటి బూమ్ వల్ల యువకులు పాశ్చత్య పోకడలకు అలవాటు పడుతున్నారు.కేవలం గిఫ్ట్‌ల కోసమే వేలాది రూపాయలు ఖర్చు పెడతారు. ఇక ప్రత్యేక భోజనం తదితర ఖర్చులు వేరేగా ఉంటాయి. అర్భన్ ఏరియాల్లో ప్రేమికుల దినోత్సవాన్ని అర్భన్ ఏరియాల్లో తల్లిదండ్రులు సైతం జరుపుకుంటారు. తమ జీవిత భాగస్వామిని ఆశ్చర్యపరుస్తూ బహుమతులు ఇచ్చేవారు లేకపోలేదు. గత కొనే్నళ్ల నుంచి తన తల్లికి తండ్రి కాన్వాస్ ఫొటో ఫ్రేములనే అందజేస్తున్నాడని మార్కెటింగ్ డైరెక్టర్ కథేరైన్ తెలియజేస్తున్నారు. ఏదిఏమైనా నాలో నేను లేను నిన్ను నాలో కొలువుంచానంటూ ప్రేమికుల మధ్య సాగే రోజా పువ్వుల గుసగుసలు రైతులకు, వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది.