Sports

అయిదు సిక్సర్లు బాదిన అర్జున్

Arjun Tendulkar Hits Five Sixers In One Over

సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ 73వ పోలీస్‌ ఇన్విటేషన్‌ షీల్డ్‌ టోర్నీలో ఆల్‌రౌండ్‌ షోతో సత్తాచాటాడు. ఎంఐజీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు…..ఇస్లాం జింఖానాతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించాడు. 31 బంతుల్లో 77 పరుగులతో బాదడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును చిత్తుచేశాడు. అయిదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు సాధించాడు. స్పిన్నర్‌ హషీర్‌ వేసిన ఓ ఓవర్‌లో అయిదు ిక్సర్లు బాదడం గమనార్హం. అర్జున్‌తో పాటు కెవిన్‌ (96), ప్రగ్నేష్‌ (112) సత్తాచాటడంతో ఎంఐజీ జట్టు 45 ఓవర్లలో ఏడు వికెట్లకు 385 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ప్రత్యర్థి జట్టు 41.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ముంబయి క్రికెట్ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ కరోనా విరామం తర్వాత ముంబయిలో జరిగిన తొలి క్రికెట్‌ పోటీగా నిలిచింది. అర్జున్‌ ఇటీవల సయ్యద్‌ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబయి తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. గురువారం జరగనున్న ఐపీఎల్‌ వేలంలోనూ అతడు ఉన్నాడు.