భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మందలపల్లికి చెందిన దేవరపల్లి హరికృష్ణ గతంలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంచేస్తూ, వారాంతపు సెలవుల్లో సేంద్రియ సాగులో ఎన్నో ప్రయోగాలు చేసి అవార్డులు దక్కించుకున్నారు. ఏడాది క్రితం ఉద్యోగాన్ని పూర్తిగావదిలి సేద్యంపైనే దృష్టిపెట్టారు. సేంద్రియ విధానం, మల్చింగ్ పద్ధతిలో ఎనిమిది ఎకరాల్లో అరటి సాగుచేశారు. అంతరపంటగా పసుపువేశారు. హైదరాబాద్‌లో సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ ఉండటంతో అరటికాయలను అట్టపెట్టెల్లో భద్రపరిచి అక్కడికి తరలిస్తున్నారు. ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో సేవలను వినియోగించుకుంటున్నారు. వీటితోపాటు సంప్రదాయ విధానంలో పండించిన ధాన్యాన్ని మర ఆడించి ఔత్సాహికులను అమ్ముతున్నారు. కేవలం అరటి ద్వారానే ఎకరాకు రూ.5-6 లక్షల ఆదాయం ఆర్జించినట్టు హరికృష్ణ తెలిపారు. గతేడాది రైతునేస్తం పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా అందుకున్నారు. ‘సేంద్రియ సాగుతో ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. చీడ,పీడల బెడద చాలా తక్కువ. ఇలాంటి పద్ధతులను రైతులు అసుసరించాలి’ అని ఆయన సూచించారు.
ఎకరానికి ₹6లక్షలు సంపాదిస్తున్న మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
Related tags :