Politics

లోకేశ్‌కు…బరువుతో పాటు బ్రెయిన్ కూడా లాస్ అయింది

Nara Lokesh Lost Brains Along With Weight Slams YSRCP MLA Gudivada Amaranath

ఇటీవల వెయిట్‌ లాస్‌ కోసం చేసే ప్రక్రియలో నారా లోకేశ్‌కు బ్రెయిన్‌ లాస్‌ కూడా అయ్యిందేమోనన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. విశాఖ స్టీల్‌ పరిశ్రమను ప్రైవేటీకరిస్తూ కేంద్రం ప్రకటించిన వెంటనే దానిని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాస్తే…ఇప్పటివరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదనడం దారుణమని పేర్కొన్నారు. విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తే, దాన్ని వ్యతిరేకించి విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజలపై కక్షగట్టిన లోకేశ్‌కు ఇప్పుడు విశాఖ గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. ఆదివారం మద్దిలపాలెం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.