నేను కాలేజీలో చదివే రోజుల్లో ఓ సీనియర్ ప్రేమలేఖ రాశాడు. అతను నాకు ఇవ్వడానికి ప్రయత్నిస్తే… నేను తప్పించుకోవాలనుకున్నా. చివరకు ఎలాగోలా నా వెంటపడి మరీ ప్రేమలేఖ, గులాబీపువ్వు ఇచ్చి వెళ్లిపోయాడు. నాకు మొదటినుంచీ అతనంటే ఇష్టంలేదు కానీ… ఆ లెటర్ మాత్రం చదివా. చాలా అద్భుతంగా అనిపించింది. దాంతో ఇంటికి తీసుకెళ్లి అమ్మకీ చూపించా. మా అమ్మ కూడా దాన్ని చదివాక మేమిద్దరం కలిసి చాలాసేపు నవ్వుకున్నాం. ఆ తరువాత అమ్మ అతనంటే ఇష్టమైతే చెప్పమని పదేపదే అడిగినా నాకు ఆసక్తిలేదని చెప్పేశా. తరువాత అతనేమయ్యాడో తెలియదు మరి.
అతను అద్భుతమైన ప్రేమలేఖ రాశాడు
Related tags :