పింఛన్ అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించడం సహా అర్హులైన వారందరికీ పింఛన్ ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. రెండోసారి అధికారం ఇస్తే అర్హులందరికీ పింఛన్లు ఇవ్వడంతోపాటు అర్హత వయస్సును 60 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ తీరు చూస్తే.. ప్రచారం ఎక్కువ పనితనం తక్కువ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఏళ్లు గడుస్తున్నా హామీల అమలులో ఎలాంటి పురోగతిలేదని విమర్శించారు. ఇంట్లో ఇద్దరు వృద్ధులుంటే ఇద్దరికీ పింఛన్ ఇవ్వాలని పేర్కొన్నారు. 2018 తర్వాత భర్తలను కోల్పోయిన ఒంటరి మహిళలను గుర్తించి తక్షణమే పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.
ఒంటరి మహిళల పింఛన్ కోసం రేవంత్ లేఖ
Related tags :