ఆయన సంకల్పం పనికిరాని చౌడు నేలలకు జీవం పోసింది.. మొక్క కూడా మొలవని చోటును పండ్ల తోటగా మార్చింది. మౌంటెయిన్ మ్యాన్ దశరథ్ మాంఝీ చెప్పిన ఒక్కమాట మంత్రమై అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. మాంఝీ మాటలే శిరోధార్యంగా తీసుకొని బిహార్‌లోని గయకు చెందిన సత్యేంద్ర గౌతమ్ మాంఝీ సమాజ హితమే ధ్యేయంగా 15 ఏళ్లుగా సుదీర్ఘ సాగు ప్రయాణం చేస్తున్నారు. మొక్క కూడా మొలవని చోట 10 వేల చెట్లతో పండ్ల తోటను సృష్టించారు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉన్నా పర్యావరణహితమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
10వేల పండ్ల మొక్కలు నాటిన బీహారీ
Related tags :