జ్ఞాపకశక్తి పెరుగుతుందంటూ తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే విద్యార్థులకు ఓ ట్యూటర్ ఇంజెక్షన్లు ఇస్తున్న ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు దిల్లీలోని మందవాలీకి చెందిన బీఏ చదువుతున్న విద్యార్థి సందీప్ (20) 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ నిర్వహిస్తున్నాడు. అయితే, అతడు జ్ఞాపకశక్తి పెరుగుతుందని పేర్కొంటూ తన వద్దకు ట్యూషన్‌కి వచ్చే విద్యార్థులకు సెలైన్ బాటిల్‌లోని ద్రావణాన్ని ఇంజక్షన్‌గా ఇస్తున్నాడు. ఓ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సందీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. అయితే, యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూశానని.. సెలైన్ ద్రావణంతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలుసుకొని విద్యార్థులకు ఇస్తున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. సందీప్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
విద్యార్థులకు జ్ఞాపకశక్తి ఇంజెక్షన్లు ఇచ్చిన టీచరు
Related tags :