రాజకీయ ప్రముఖులంతా అమరావతి రైతుల దీక్షలకు మద్దతు తెలపాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దిల్లీలో రైతుల నెల రోజుల దీక్షకే నాలుగుసార్లు కేంద్రం చర్చలకు పిలిచిందని ఆయన అన్నారు. ఏడాదికి పైగా దీక్షలు చేస్తున్న అమరావతి రైతులను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తమపై బనాయించిన అక్రమ కేసులకు సంబంధించి ఈ నెల 4న తాడిపత్రిలో ఆందోళనకు దిగుతామని దివాకర్‌రెడ్డి ప్రకటించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి రైతులు ఏడాదిగా పైగా ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.
సొంత కేసులు రైతుల కోసం జేసీ దీక్ష
Related tags :