ఈ నెల 17 వ తేదీన నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నటు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
జన్మదిన వేడుకలకు వేదిక అయిన జలవిహార్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్రను వివరించేలా త్రీ డీ గ్రాఫిక్స్ లో రూపొందించిన డాక్యుమెంటరీ టీజర్ ను తలసాని ఆవిష్కరించారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జలవిహార్ లో నిర్వహించే జన్మదిన వేడుకలలో 30 నిమిషాల వ్యవధి కలిగిన త్రీ డీ డాక్యుమెంటరీ తో పాటు ప్రత్యేకంగా రూపొందించిన 5 పాటలను కూడా ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని బల్కంపేట ఎల్లమ్మ కు రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను ఎంఎల్ సీ కవితతో కలిసి సమర్పిస్తామని, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో, కోటి కుంకుమార్చన, పార్సీ గుట్ట లోని శ్రీ బంగారు మైసమ్మ ఆలయంతో అమ్మవారికి బంగారు కవచం అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆద్వర్యంలో చేపట్టిన కోటి వృక్షార్చన లో భాగంగా మొక్కలు నాటడం జరుగుతుందని వెల్లడించారు.