Business

పసిడి బాండ్లలో పెట్టుబడి పెట్టండి-వాణిజ్యం

పసిడి బాండ్లలో పెట్టుబడి పెట్టండి-వాణిజ్యం

* మన దేశంలో ఏటా 800-1000 టన్నుల దాకా బంగారానికి గిరాకీ లభిస్తోందని అంచనా. ఇది అధికారికంగా దిగుమతి అయ్యేది. ఇదికాక దేశంలోకి ఏటా 100-120 టన్నుల వరకు బంగారం దొంగచాటుగా (స్మగ్లర్ల ద్వారా) ప్రవేశిస్తోందని ప్రపంచ స్వర్ణమండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేస్తోంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఆభరణాల కోసం బంగారం కొనుగోలు చేస్తుంటే, మిగులు/ నల్లధనం కలిగిన వారు మాత్రం సంపద పెరుగుతుందని, సులభంగా భద్రపరచుకునేందుకు వీలవుతుందనే భావనతో పెట్టుబడులుగా మేలిమి బంగారం (999 స్వచ్ఛత) నాణేలు, బిస్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇందులోనూ ఆభరణాల దుకాణాలకు చేరేది కొంత అయితే, మిగిలింది పెట్టుబడుల రీత్యా కొనుగోలు చేసేవారి వద్దే ఉంటోంది. 2020లో మాత్రం అధిక ధర, కొవిడ్‌ మహమ్మారితో ఏర్పడిన పరిస్థితుల వల్ల గిరాకీ తగ్గి, 450 టన్నుల బంగారం అధికారికంగా ప్రవేశించింది. నౌకలు, విమానాల రాకపోకలు కొన్ని నెలల పాటు నిలిచిపోవడంతో, దొంగచాటుగా వచ్చిన బంగారం కూడా 25 టన్నులకు లోపే ఉంటుందని డబ్ల్యూజీసీ లెక్కకట్టింది. ఆభరణాలు కొనుగోలు చేసేవారి సంఖ్య ఎటూ తగ్గదు. సంపద పెంపుకోసం మేలిమి బంగారం కొనుగోలు చేసేవారిని ఆకర్షించేలా సార్వభౌమ పసిడి బాండ్ల (ఎస్‌జీబీ) పథకాన్ని 2015 నవంబరు నుంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం అమలులోకి వచ్చి అయిదేళ్లు దాటింది.

* అమెజాన్ సంస్థ తయారు చేసి విక్రయించే పరికరాలను దేశీయంగానే ఉత్పత్తి చేయాలని ఆ సంస్థ భారతీయ విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత ప్రభుత్వం మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌పై ఎక్కువగా దృష్టిపెట్టడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు నేడు ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిలో భాగంగా తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ సంస్థ చెన్నై విభాగంతో అమెజాన్‌ ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ విభాగం ఐఫోన్‌, ఐపాడ్స్‌, షావోమి పరికరాలను తయారు చేస్తోంది. ఫైర్‌ టీవీ స్టిక్స్‌ పరికరాలను భారీఎత్తున చెన్నై ప్లాంట్‌లో తయారు చేయాలని అమెజాన్‌ భావిస్తోంది. అవసరన్ని, డిమాండ్‌ను బట్టి వీటి తయారీని ఇతర పట్టణాలకు విస్తరించే అవకాశం ఉంది.

* ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో పుంజుకునే దిశగా భారత ఆర్థిక వ్యవస్థ పయనిస్తోందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ తెలిపింది. వ్యవసాయ రంగంలో స్థిరమైన వృద్ధి, కొవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం, ప్రభుత్వ వ్యయం పెరగడం వంటివి అందుకు దోహదం చేయనున్నాయని పేర్కొంది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కూడా దన్నుగా నిలుస్తుందని వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థాయిలో పెట్టడానికి ఇంకా అనేక చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయపడింది. దేశంలో ప్రతిఒక్కరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ అందించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

* గత ఏడాది మీ ఆర్థిక చరిత్రను తీరిగ్గా కూర్చుకొని సమగ్రంగా విశ్లేషించండి. 2020లో మీరు వేసుకున్న ఆర్థిక ప్రణాళిక నుంచి మొదలు పెట్టండి. మీ ఆదాయ వనరులు ఏంటి.. అవి ఎలా దెబ్బతిన్నాయో గమనించండి. వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టారో చూడండి. అనసరంగా ఖర్చు చేశారేమో ఆలోచించండి. అవి ఈ ఏడాది జరగకుండా జాగ్రత్తపడండి. ఎక్కడ సర్దుబాటు చేసుకోగలరో యోచించండి. పోయిన ఆదాయ వనరుల్ని తిరిగి ఎలా రాబట్టుకోవాలో ఆలోచించండి. తప్పు ఎక్కడ జరిగిందో మథించండి. లేదా ప్రత్యామ్నాయాలైనా వెతకండి. అలా తొలుత మీ ఆదాయ వనరులపై సమగ్రంగా సమీక్షించుకోండి. ఆదాయం ఉంటేనే కదా.. పొదుపు చేసేది!

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఉదయం 52,398 వద్ద శుభారంభం చేసిన సెన్సెక్స్‌ చివరకు 49 పాయింట్లు నష్టపోయి 52,104 వద్ద ముగిసింది. అదే ట్రెండ్‌ను కొనసాగించిన నిఫ్టీ.. 15,371 వద్ద సానుకూలంగా ప్రారంభమై చివరకు 1 పాయింట్‌ నష్టపోయి 15,313 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.69 వద్ద నిలిచింది. ఉదయం 52,431 వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌ క్రమంగా దిగజారుతూ వచ్చింది. మధ్యాహ్నం పూర్తిగా నష్టాల్లోకి జారుకొని 51,871 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇదే బాటలో పయనించింది. ఇంట్రాడేలో 15,247 వద్ద కనిష్ఠాన్ని, 15,422 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని రికార్డు చేసింది. నిన్నటి భారీ లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం ప్రభావం చూపింది. దీంతో కీలక బ్యాంకింగ్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

* సెక్యూరిటీ అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌(శాట్‌)లో ఫ్యూచర్‌ గ్రూప్‌నకు ఊరట లభించింది. ఆ గ్రూప్‌ వ్యవస్థాపకులు కిశోర్‌ బియానీ, ఆయన సోదరుడు అనిల్‌ బియానీ, ఫ్యూచర్‌ కార్పొరేట్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్ సంస్థలు సెక్యూరిటీ మార్కెట్లకు ఏడాది పాటు దూరంగా ఉండాలని ఫిబ్రవరి 3వ తేదీన ఆదేశించింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిర్వహించినట్లు వీరిపై ఆరోపణలు రావడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకొంది. దీంతోపాటు ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ షేర్ల క్రయవిక్రయాలు రెండేళ్లపాటు చేయకూడదని వీరిని ఆదేశించింది. దీంతో ఫ్యూచర్‌ గ్రూప్‌ శాట్‌ను ఆశ్రయించింది.

* రైల్‌టెల్ ‘ఐపీఓ’ ఈ రోజు నుంచి మొదలవుతోంది. ఇందులో కొనుగోళ్ల‌కు ముందు కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి. రైల్‌టెల్ ఐపీఓ ‘ఆఫ‌ర్‌ ఫర్ సేల్’. ప్ర‌భుత్వం 87.15 మిలియ‌న్ షేర్ల‌ను లేదా ఇందులో 27.16% వాటాను విక్ర‌యిస్తుంది. ప్ర‌భుత్వ సంస్థ దాని ప్రారంభ వాటా – అమ్మ‌కం కోసం ఒక షేర్‌కి రూ.93-94 ధ‌ర‌ను నిర్ణ‌యించింది. రైల్‌టెల్ ఐపీఓ ఫిబ్ర‌వ‌రి 18న ముగుస్తుంది. దేశ‌వ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ టెలికాం మ‌రియు మ‌ల్టీమీడియా నెట్‌వ‌ర్క్‌ను అందించే రైల్‌టెల్‌, దేశంలోని అతిపెద్ద త‌ట‌స్థ టెలికాం మౌలిక స‌దుపాయాల సంస్థ‌ల‌లో ఒక‌టి. ఇది ప్ర‌త్యేక‌మైన ‘రైట్ ఆఫ్ వే’ తో పాటు పాన్‌-ఇండియా ఆప్టిక్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్‌ని క‌లిగి ఉంది.