DailyDose

పందుల వ్యాపారి డబ్బు తినేసిన చెదపురుగులు-నేరవార్తలు

Mylavaram Pig Trader Money Eaten By Bugs - Telugu Crime News

* మైలవరం వాటర్ ట్యాంక్ వద్ద పందుల వ్యాపారం చేసుకునే బిజిలి జమలయ్య తన వ్యాపారంలో వచ్చిన లాభాలను బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులను నమ్మలేక ట్రంకు పెట్టెలో దాచిపెట్టి భద్రం చేసుకున్నాడు.ఒక పది లక్షలు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుందామనుకున్నాడు.సుమారు 5లక్షల రూపాయలు దాచిపెట్టాడు. అకస్మాత్తుగా వ్యాపారానికి ఒక లక్ష కట్టాల్సి వచ్చి రాత్రి తన ట్రంకు పెట్టె తెరిచాడు.లోపలున్న డబ్బులు చూసి బావురుమన్నాడు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయాన్నే ట్రంకు పెట్టెలో చెదలు పట్టిన డబ్బు తీసి మంచం పై వేసి లెక్కపెట్టడం ప్రారంభించారు.చుట్టుప్రక్కల వారికి తెలియడంతో ఆనోటా ఆనోటా పోలీసులకు సమాచారం అందింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జమలయ్య ఇంటికి వెళ్ళి ఆరా తీశారు.పోలీసులను చూడడంతో నే బావురుమంటూ తమ భాధ వెళ్ళగక్కారు జమలయ్య కుటుంబీకులు.చెదలు పట్టిన నోట్లతో చిన్న పిల్లలు ఆడుకోవడం చూసి స్థానికులు నోరెళ్ళబెట్టారు.తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 54 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకువెళ్లడంతో సుమారు 38 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఏడుగురిని సహాయక సిబ్బంది కాపాడారు. తక్కిన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సిద్ధి నుంచి సాత్నా వెళ్తుండగా ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఐజీ ఉమోష్ జోగ తెలిపారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సు ఫోర్సుతో పాటు గజ ఈతగాళ్లు, క్లేన్లను రంగంలోకి దింపారు. బాణసాగర్ కెనాల్‌లో నీటిని సిహ్వాల్ కెనాల్‌లోకి విడుదల చేయడం ద్వారా బస్సును క్రేన్లతో వెలికితీసే చర్యలు చేపట్టారు.

* ఓటుకు నోటు కేసులో నిందితులపై అభియోగాల నమోదు.* రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ పై అభియోగాలు నమోదు చేసిన ఏసీబీ కోర్టు.* నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 నమోదు చేసిన ఏసీబీ కోర్టు.* రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 అభియోగం నమోదు.* తమపై అభియోగాల్లో నిజం లేదని తోసిపుచ్చిన రేవంత్, ఇతర నిందితులు.* సండ్ర వెంకటవీరయ్యపై గతంలోనే అభియోగాలు నమోదు చేసిన కోర్టు.* ఈనెల 19న సాక్షుల విచారణ షెడ్యూలు ఖరారు చేస్తామన్న ఏసీబీ. కోర్టు.

* అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన వారిలో 103 మంది కరోనా పాజిటివ్‌గా తేలిన ఘటన బెంగళూరులోని బొమ్మనహళ్లిలో జరిగింది.

* మహిళ భుజాలపై భర్త కుటుంబ సభ్యుడిని కూర్చోబెట్టి..మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది.భర్తతో విడిపోయి మరో వ్యక్తితో కలిసి జీవిస్తున్న గిరిజన మహిళ పట్ల అనాగరికంగా వ్యవహరించారు భర్త కుటుంబ సభ్యులు.మహిళ భుజాలపై భర్త కుటుంబ సభ్యుడిని కూర్చోబెట్టి 3 కిలోమీటర్ల వరకు బలవంతంగా నడిపించారు.కొందరు యువకులు మహిళ వెనుక ఉండి… ఆమె వేగం తగ్గించినప్పుడు పాశవికంగా కర్రలతో కొట్టారు.