రేవంత్ రెడ్డి నేతృత్వంలో రావిరాలలో జరుగుతున్న రాజీవ్ రైతు రణభేరి సభపైనే అందరి దృష్టి నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఈ సభకు ఎవరూ ఊహించని వ్యక్తి హాజరయ్యారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా కనిపించిన వ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన సూరీడు సభా వేదికపై తళుక్కున మెరిశారు. రేవంత్ రెడ్డితో కలిసి ఫొటో దిగారు. ఆయన రాక సరికొత్త చర్చకు దారితీసింది. వైఎస్ మరణించినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న సూరీడు.. ఇవాళ రేవంత్ సరసన కనపడటం చర్చనీయాంశమైంది.
రేవంత్ వద్దకు చేరిన సూరీడు

Related tags :