* పాము తలకు కండోమ్ బిగించిన దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ముంబైలోని మిడోస్ హౌసింగ్ సొసైటీ ఏరియాలో నివాసం ఉంటున్న వైశాలి తన్హా అనే యువతికి ఓ పాము.. తలకు చిన్న ప్లాస్టిక్ బ్యాగుతో దిక్కుతోచని స్థితిలో అటుఇటు కదులుతూ కనిపించింది. ఆమె దాని దగ్గరకు వెళ్లి చూసింది. తలపై ఉన్నది ప్లాస్టిక్ బ్యాగు కాదని, కండోమ్ అని గుర్తించింది. వెంటనే మిఠా మల్వంకర్ అనే పాముల సంరక్షకుడికి ఫోన్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మల్వంకర్ 2.5 అడుగుల నీటి పామును చేతుల్లోకి తీసుకున్నాడు. కండోమ్‌ని తీసిపారేసి రక్షించాడు. అయితే కండోమ్ కారణంగా సరిగా ఊపిరి తీసుకోలేకపోయిన పాము అస్వస్థతకు గురైంది. దాన్ని సంజయ్ గాంధీ నేషనల్ పార్కుకు తరలించి చికిత్స అందించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుభవం ఉన్న వ్యక్తే పాము మెడకు కండోమ్ కట్టి ఉంటాడని, అది విషరహితమైనదైనా దాని కాట్లు దారుణంగా ఉంటాయని మల్వంకర్ తెలిపాడు.
* నవరంగపూర్ జిల్లా ఝోరిగాం సమితి కుటిరచొపర్ గ్రామ పంచాయతీ కిలిగౌడసాహి గ్రామంలో విషం తాగి ఓ ప్రేమ జంట సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. 15 రోజులుగా దంపతుల్లా కలిసిమెలిసి జీవిస్తున్న ప్రేమజంట అకస్మాత్తుగా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఖామ్‌సింగ్ గౌడ చిన్న కుమారుడు ఇంద్ర గౌడ, అదే గ్రామానికి చెందిన జయసింగ్ గౌడ చిన్న కుమార్తె దుతిక గౌడ ప్రేమించుకున్నారు. 15 రోజుల కిందట ప్రేమికురాలు దుతిక గౌడను ఇంద్రగౌడ తన ఇంటికి తీసుకు వచ్చాడు. ఆ రోజునుంచి దంపతుల్లా ఇద్దరూ నూతన జీవనం ప్రారంభించారు.
* పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయ ఢంకా మోగిస్తున్నారు. మూడో దశలోనూ టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ మద్దతుదారులు అతి తక్కువ సంఖ్యలో గెలుపొందారు. తాజాగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా దయనీయ పరిస్థితి ఎదురైంది. ఫలితాలు వెల్లడైన 24 పంచాయతీల్లో 21 మంది అధికార పార్టీకి చెందిన మద్దతుదారులు గెలుపొందడం విశేషం. గుడిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. మూడో విడత ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు హవా కొనసాగించారు.
* ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’లో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం కన్నడ చిత్రాలపై ఆమె చేసిన ట్వీట్ తాజాగా మరోసారి వైరల్ అవుతోంది. ఇప్పట్లో కన్నడ చిత్ర పరిశ్రమలో తాను అనుగుపెట్టనని, ప్రస్తుతం కన్నడ సినిమాల్లో నటించే అవకావం లేదంటూ 2017లో ట్వీట్ చేసి శృతి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు కన్నడ పరిశ్రమపై గౌరవం లేదని, అందుకే అవకాశాలను వదులుకుంటోందంటూ కన్నడ ప్రేక్షకులంతా శృతిపై విరుచుకుపడ్డారు. ఇక తాజాగా కన్నడ దర్శకుడైన ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ‘సలార్’ చిత్రంలో ఆమె నటించేందుకు రేడి అవ్వడంతో మరోసారి నెటిజన్లు శృతిపై వరుస కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు కన్నడ చిత్రాల్లో నటించనంటూ పరిశ్రమను అగౌరపరిచి.. ఇప్పుడు కన్నడ దర్శకుడి చిత్రంలో నటించేందుకు సిద్దమైందంటూ నెటిజన్‌లు విమర్శలు గుప్పిస్తున్నారు.
* మధ్యప్రదేశ్‌లోని పురాతన ఆలయానికి భారీ గంటను భక్తులు అందించారు. ఏకంగా మూడున్నర క్వింటాళ్ల బరువున్న గంటను ఆలయానికి ఊరేగింపుగా తరలించారు. మధ్యప్రదేశ్‌లోని మందసార్ జిల్లాలోని పశుపతినాథ్ ఆలయానికి ఆ గంటను బహూకరించారు. అంతకుముందు భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల విరాళాలు.. సహకారంతో ఈ మహాగంటను ఆలయానికి చేర్చారు.
* ఫుట్ పీలింగ్ మాస్క్ జెల్‌ను రెండు అరికాళ్లకు పట్టించుకోవాలి. బాగా ఆరిన తర్వాత జెల్ అరికాళ్లకు గట్టిగా అతుక్కుపోయి పైన చర్మంలాగా ఏర్పడుతుంది. పైన చర్మంలాగా ఉన్న దాన్ని పీకేసుకోవాలి. అయితే ఈ ఛాలెంజ్ మనం అనుకున్నంత వీజీ ఏమీ కాదు! ఎక్కవ సేపు గనుక చర్మంపై దాన్ని ఉంచుకుంటే అలర్జీల బారిన పడి కాళ్లకు పుండ్లు లేచే అవకాశం ఉంది. జెల్ చర్మాన్ని గట్టిగా అతుక్కంటే కాలి చర్మం కూడా ఊడి వస్తుంది.
* అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో ప్రమాదంలో పడిన ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కొందరు రాజీవ్‌గాంధీ హత్య, హంతకులపై మీ అభిప్రాయం చెప్పండి అని రాహుల్‌ను అడిగారు. దీంతో రాహుల్ గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు. మా నాన్న హత్య చేసిన వారిని క్షమిస్తున్నా అని ప్రకటించారు. వారిపై (హంతకులు) తనకేం కోపం లేదని స్పష్టం చేశారు. ‘నా తండ్రిని కోల్పోయాను. అది అత్యంత కఠిన కాలం. కాకపోతే నాకు ఎవరిపై కోపం లేదు. మీకు ఎవరైనా గుండెకోత కలిగిస్తారో.. నాకు అంతకంటే ఎక్కువగా బాధ ఉంది. అయినా కూడా నాకు ఎవరిపై కోపం లేదు. వారిని క్షమిస్తున్నా. నా తండ్రి నాలో ఉన్నాడని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.
* కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పరిరక్షణ కమిటీ ప్రతినిధులు విశాఖపట్టణంలో బుధవారం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.
* లైంగిక దాడి కేసులో వివాదాస్పద తీర్పులు వెల్లడించిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద తీర్పులు ఆమె పదోన్నతికి ఎసరు పెట్టాయి. కేంద్రం ఆమెకు పదోన్నతి కల్పించకూడదనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఓ మహిళ పుష్ప గనేడివాలా తీర్పులను వ్యతిరేకిస్తూ.. నిరసనగా జడ్జికి కండోమ్‌లు పంపింది. అహ్మదాబాద్‌కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు దేవ్‌శ్రీ త్రివేది.. జస్టిస్ గనేడివాలా పని చేస్తోన్న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ రిజిస్ట్రీతో పాటు ముంబైలోని మరో 12 వేర్వేరు ప్రదేశాలకు కండోమ్‌లు పంపినట్లు వెల్లడించింది.
* మైసూరులో సభ్యసమాజం తలదించుకునే అమానుషం ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ యువకుడు వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడగా కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. మైసూర్‌లోని గోకులం 3వ స్టేజ్‌లో నివసించే సోమశేఖర్ (26) ఈ నెల 11న రాత్రి సమయంలో సందులో చాటుగా వీధి కుక్కపైన లైంగిక దాడికి పాల్పడుతుండగా, కొందరు యువకుల వీడియో తీసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు. పీపుల్ ఫర్ అనిమల్స్ (పీఎఫ్‌ఎ) అనే స్వచ్ఛంద సంస్థ వీవీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంతువులపై లైంగికదాడి జరిపాడన్న అభియోగాలతో కేసు నమోదు చేసి నిందితున్ని సోమవారం అరెస్టు చేశారు. కుక్కను గుర్తించి వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు.
* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో చిరకాలం కొనసాగేలా దీవించాలని ప్రార్ధిస్తున్నాను’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
* కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న తమకు నెట్‌వర్క్ సదుపాయం కల్పిఇంచాలని తొమ్మిది గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు లేఖలు రాశారు. మీరావలి, దుర్గాపాడు, పిప్పిలిగుడ, కారుడాయి, బొడొ అలుబడి, కూలి, బాయిసింగి, డంగలొడి, హలువ గ్రామాలకు చెందిన విద్యార్థులు పీఎం, సీఎంకు తాము రాసిన రెండు లేఖలను మంగళవారం మీరావలి పోస్టాఫీసులో పోస్ట్ చేశారు. కరోన కారణంగా విద్యాలయాలు మూతపడడంతో, విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆన్‌లైన్‌లో బోధనకు చర్యలు చేపట్టింది. అయితే, రాయగడ సమితిలోని తొమ్మిది పంచాయితీల్లో ఎటువంటి నెట్‌వర్క్ లేకపోవడంతో ఆయా గ్రామాల విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలకు దూరంగా ఉంటున్నారు.
* భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బౌలింగ్ వేయగా.. మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి కలయికతో టోర్నమెంట్ అందరినీ ఆకట్టుకుంది. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో ఆయన మేనల్లుడు, మంత్రి హరీశ్‌రావు ఉత్సాహంగా పాల్గొన్నారు. సిద్దిపేటలోని క్రీడా మైదానంలో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. పది రోజులుగా జరుగుతున్న మ్యాచ్‌లు బుధవారం ఫైనల్‌కు చేరాయి.