DailyDose

హైకోర్టు న్యాయవాదుల దారుణ హత్య-నేరవార్తలు

హైకోర్టు న్యాయవాదుల దారుణ హత్య-నేరవార్తలు

* పెద్దపల్లి జిల్లా రామగిరి మండల సమీపాన జరిగిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య దారుణమని,దీనికి పూర్తి బాధ్యత పోలీసులదేనని మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్గిళ్ళ శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు.పట్టపగలు దుండగులు దంపతులను హత్యచేయడం అత్యంత బాదాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు.

* రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో దారుణం జరిగింది. కారులో హైదరాబాద్‌కు వెళ్తున్న హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులు హత్యకు గురయ్యారు. కారు ఆపి దంపతులిద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పరారయ్యారు. కారులోనే విచక్షణారహితంగా కత్తులతో నరికిచంపిన దుండగులు. మంథని కోర్టులో ఓ కేసుకు హజరైన గట్టు వామన్​ రావు, నాగమణి దంపతులు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్​ వెళ్తుండగా కల్వచర్ల శివారులో కారును అడ్డుకొని ఇద్దరిపై కత్తులతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.చికిత్స పొందుతూ భార్య భర్తలు మృతి చెందారని తెలిపారు డాక్టర్లు. పక్క ప్రణాళికతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు. గట్టు వామన్​ రావుది మంథని మండలంలోని గుంజపడుగు గ్రామం. సంఘటన స్థలంలో చేతి గ్లౌజ్​లు లభ్యం అయ్యాయని తెలిపారు పోలీసులు. పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న పలు అక్రమాలపై హైకోర్డులో ఫిల్స్​ వేశారు గట్టు వామన్​రావు నాగమణి. ఈ క్రమంలోనే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలుసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవలే తమకు ప్రాణహాని ఉందని హైకోర్టు చీఫ్ జస్టీస్ కు తెలిపారు న్యాయవాది వామన్ రావ్. శీలం రంగయ్య లాక్ అప్ డెత్ కేసులో హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు వామన్ రావ్. ఈ కేసులో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను విచారణ అధికారిగా నియమించింది హైకోర్టు. కేసు వాపస్ తీసుకోవాలని గుర్తు తెలియని దుండగులు బెదిరింపులు చేశారు. రామగుండం సీపీ సత్యనారాయణతో వాగ్వాదానికి దిగారు వామన్ రావు. గతంలో మాజీఎమ్మెల్యే పుట్ట మధుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాదులు.

* యువకునిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి గాయపడిన సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా గల దళితవాడ సమీపంలో చోటు చేసుకుంది దళితవాడకు చెందిన కాకి శ్రీనివాసరావు ఓటు వేసి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు పిలిసి పొలాల్లోకి తీసుకెళ్లి దాడి చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు వివరాలు తెలియాల్సి ఉంది.

* అనుమతి లేకుండా తరలిస్తున్న బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. నవీద్ బాషా అనే వ్యక్తి దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. నవీద్‌ను తనఖీ చేసినపుడు అతడి వద్ద బంగారు బిస్కెట్లు దొరకాయి. దీంతో నవీద్ నుంచి 1,635 గ్రాముల బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాషాను రిసీవ్ చేసుకునేందుకు కడప జిల్లాకు చెందిన షేక్ ఇబ్రహీం, షేక్ మహ్మద్ గౌస్ అనే వ్యక్తులు వచ్చారు. అనుమానంతో వీరి ఇద్దరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి బంగారు బిస్కెట్లు, రూ.10,300 వేల నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.