* విజయవాడ..దుర్గ గుడి పై ఏసీబీ అధికారులు సోదాలు..స్టోర్ మరియు చీరలు, పరిపాలన విభాగం, ప్రసాదాల తయారీ విభాగాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.
* బంగాల్లో జరిగిన బాంబు దాడిలో గాయపడ్డ రాష్ట్ర మంత్రి జాకిర్ హుస్సేన్ ఆరోగ్య నిలకడగా ఉందని.. చెయ్యి, కాలుకు గాయాలయ్యాయని ముర్షిదాబాద్ వైద్య కళాశాల వెల్లడించింది.
* అనంతపురం గోరంట్ల తహసిల్దార్ కార్యాలయం పై గురువారం ఏసీబీ అధికారుల దాడి.
* కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి పారిశ్రామికవాడలో టైర్ల కంపెనీలో అగ్ని ప్రమాదం జరగింది.
* మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అంశంపై సుమోటోను సుప్రీంకోర్టు ముగించింది. రెండేళ్లు గడిచినా ఈ కేసులో ఎలక్ట్రానిక్ ఆధారాల రికవరీకి అవకాశం లేకుండా పోయిందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును ఇంకా పొడిగించాల్సిన అవసరం లేదని నిర్ణయించింది.
* ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షబ్నమ్ స్వాతంత్య్రానంతరం తొలిసారి ఉరిశిక్షకు గురయ్యే మహిళ అయ్యే అవకాశం ఉంది.యూపీలోని అమ్రోహా ప్రాంతానికి చెందిన ఆమె.. 2008లో ప్రియుడు సలీంతో కలిసి తన కుటుంబానికే చెందిన ఏడుగురిని అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి హతమార్చింది.ఇంగ్లిష్‌లో ఎంఏ చేసిన షబ్నమ్.. ఐదో తరగతి ఫెయిలైన సలీంను ప్రేమించింది.పెళ్లికి కుటుంబసభ్యులు నిరాకరించినందున ఈ ఘాతుకానికి పాల్పడింది.చనిపోయిన వారిలో ఆమె తల్లిదండ్రులు సహా.. సోదరులు, సోదరి కూడా ఉన్నారు. ఈ కేసులో సలీం, షబ్నమ్‌లకు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది.సుప్రీం న్యాయస్థానం కూడా కింది కోర్టు తీర్పును సమర్థించడం వల్ల.. చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు.అది కూడా తిరస్కరణకు గురవ్వడంతో వీరిని ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
* దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు రైల్‌రోకో చేపట్టారు. దీంతో రైళ్లు నిలిచిపోయాయి.వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పట్టాలపై బైఠాయించి నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఆందోళనల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు.
* జమ్ముకశ్మీర్‌లో మరో ఉగ్రవాద రహస్య స్థావరాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.సైనిక బృందం, కశ్మీర్ పోలీసులు.. ఈ నెల 17, 18న చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా.. రియాసి జిల్లాలో ఈ స్థావరం బయటపడింది. అక్కడి నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.ఏకే47 రైఫిల్-1, ఎస్ఎల్ రైఫిల్-1, 303 బోల్ట్ రైఫిల్, చైనీస్ పిస్టల్స్-2 లను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు.
* శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు అక్రమ బంగారం పట్టివేత.దుబాయ్ నుండి FZ -8779 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద 1.4 కిలోల బంగారం పట్టుబడింది.నింధితులు బంగారం జీన్స్ పైంట్ నడుబాగంలో, అత్యవసర టార్చ్ లో బంగారం ను అమర్చుకు తరలిస్తుండగా గుర్తించిన కస్టమ్స్.