* ఫిబ్రవరి నెలలో 12వ సారి పెట్రోల్ ధరలు పెంపు.లీటర్ పెట్రోల్, డీజీల్ పై 36 పైసలు పెంపు.ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.30, డీజీల్ రూ. 87.30.ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 89.88, డీజీల్ రూ.80.27.హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.93.45, డీజీల్ రూ.87.50.
* ఎల్‌ఐసీ ఐపీవోకు వచ్చేందుకు వీలుగా సెక్యూరీటీస్ అండ్ ఎక్స్‌ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) వేదికను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా పెద్ద కంపెనీల లిస్టింగ్ నిబంధనలను సవరించింది. ఈ మేరకు రెగ్యూలేటరీ ఓ ప్రకటన చేసింది. ‘‘ఇప్పుడు పెద్ద కంపెనీలు ఐపీవోకు రావాలంటే 10శాతం అవసరం లేదు.. సుమారు ఐదు శాతం వాటాలు విక్రయిస్తే చాలు. ఆ తర్వాత కూడా మూడేళ్లకు బదులు ఐదేళ్లలో 25శాతం వాటాలను ప్రజలకు కేటాయించే అవకాశం ఉంది’’ అని సెబీ పేర్కొంది. ఈ నిర్ణయంతో భారీ కంపెనీలు మార్కెట్ లిస్టింగ్ మరింత సరళతరంగా మారింది.
* ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా కేంద్రం ప్రభుత్వం కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తరహా ఫీచర్స్‌తో దేశీయ ఇన్‌స్టా మెసేజింగ్ యాప్ సందేశ్ (Sandes)ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) అభివృద్ధి చేసింది. గతంలో ప్రభుత్వ అధికారులు అంతర్గత సమాచార బట్వాడా కోసం ఉపయోగించిన గవర్నమెంట్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సిస్టం (జిమ్స్)లో మార్పులు చేసి సందేశ్ యాప్‌ను తీసుకొచ్చారు. ఇప్పటివరకు ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఇక మీదట సాధారణ ప్రజలూ ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఐఓఎస్ యూజర్స్ నేరుగా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్, ఐపాడ్‌లో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్స్ జిమ్స్ వెబ్‌సైట్ నుంచి ఆ ఏపీకే డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
* భారత్‌లో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన 6.7బిలియన్ డాలర్ల కార్యక్రమం నుంచి లబ్ధిని అందిపుచ్చుకోవాలని టెక్ దిగ్గజం యాపిల్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపాడ్ తయారీకి సంబంధిన ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు యాపిల్ భారత్‌లో ఐఫోన్ల తయారీని క్రమంగా పెంచుతోంది..దీంతోపాటు తన కాంట్రాక్టర్ల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాన్ని అందిపుచ్చుకొంది.