మన దేశంలోకి బొప్పాయి 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. 2007 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు అంచనా. ముఖ్యంగా కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్లతోట. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పరందపుకాయ, పరమాత్ముని కాయ, మదన ఆనపకాయ అని అని కూడా బొప్పాయిని పిలుస్తుంటారు.
**వైద్య పరమైన ఉపయోగములు
బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ “ఏ”, విటమిన్ “బీ”, విటమిన్ “సీ”, విటమిన్ “డీ”లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. ఆ జబ్బులను మటుమాయం చేసేందుకు తరచూ బొప్పాయి పండును ఆహారంగా సేవించాలంటున్నారు వైద్యులు. ఉదరంలోని పేగులు శుభ్రమైతే శరీరం పూర్తిగా శుభ్రంగానున్నట్లే లెక్క. దీంతో శరీరం ఉల్లాసంగా తయారై తనపని తాను చేసుకుంటూ పోతుంటుంది.
**అనువైన వాతావరణం
బొప్పాయి ఉష్ణమండలపు పంట. సముద్ర మట్టం నుంచి 1000 మీ. ఎత్తువరకు పెంచవచ్చు. వేసవిలో 32 డిగ్రీల సెం.గ్రే. నుంచి 38 డిగ్రీల సెం.గ్రే వరకు తట్టుకుంటుంది. చలికాలంలో 5 డిగ్రీల సెం.గ్రే.కి తక్కువ ఉండరాదు. బొప్పాయి సాగుకు సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. వీటితోపాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా సాగుచేయవచ్చును. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు, ఆమ్ల భూములు, సున్నపురాయి గల నేలలు బొప్పాయి పంటకు పనికిరావు. బొప్పాయికి అధిక గాలుల నుంచి రక్షణ అవసరం.
**ఇతర రకాలు
బొప్పాయి కాయల నుంచి పాలు సేకరించి పపైన్ తయారీకోసం కో-2, కో-5 రకాలు సాగుచేస్తున్నారు.పచ్చికాయలు కూరకోసం పూసాజెయింట్ రకం అనువుగా ఉంటుంది.పూసా మెజెస్టీ, రెడ్ లేడీ రకాలు ఎక్కువ రోజులు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతోపాటు దూర ప్రాంతాల రవాణాకు అనుకూలం.
పెరటి తోటల్లోనూ, ఇంటి ఆవరణలోనూ అందంగా పెంచుకోవటానికి పూసాడ్వార్ఫ్ రకం అనుకూలం.నీటి ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నాటుకోవటానికి పూసా నానా రకం అనుకూలంగా ఉంటుంది.రంగు, రుచి కలిగిన చిన్న కాయల కోసం ‘సోలో’, ఆర్క సూర్య రకాలు సాగు చేయవచ్చు.
**పోషక విలువలు
కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు[1] బొప్పాయిపండులో పుష్కలం.మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.విటమిన్ బి (రైబోఫ్లెవిన్ 250 మైక్రోగాములు) నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.బొప్పాయి ‘కాయ’ జీర్ణానికి తోడ్పడితే, ‘పండు’ పోషకాలనిస్తుంది.బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.
**ఇతర ఉపయోగాలు
బొప్పాయి మంచి సౌందర్యసాధనం కూడా పనిచేస్తుంది.బొప్పాయిలోని తెల్లని గుజ్జుని మొహనికి రాయడంవల్ల మంచి మెరుపు వస్తుంది.మొటిమలూ తగ్గుతాయి.
బొప్పాయి ఫేస్‌ప్యాక్ జిడ్డుచర్మానికి ఎంతో మంచిది. అందుకే సబ్బులు, క్రీముల్లో కూడా ఎక్కువగా వాడుతున్నారు.బొప్పాయి పండు తింటే హృద్రోగాలూ, కోలన్ క్యాన్సర్లూ రావు. పండులోని బీటా కెరోటిన్ క్యాన్సర్‌నీ రాకుండా నిరోధిస్తుంది.ఆస్తమా, కీళ్లవ్యాధుల వంటివి రాకుండా నిరోధిస్తుంది.మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు.ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.బొప్పాయిపండులోని పీచు మొలల్నీ రానివ్వదు.బొప్పాయిపండు తినడంవల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి… వంటివీ తగ్గుతాయి.బొప్పాయిపండు తామర వ్యాధిని తగ్గిస్తుంది.పచ్చికాయ అధిక రక్తపోటుని (హై బీపీ) నియంత్రిస్తుంది.శృంగారప్రేరితంగానూ పనిచేస్తుంది.గింజల్లో యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంథెల్‌మింటిక్ గుణాలు మెండు. అందుకే కడుపునొప్పికీ ఫంగల్ ఇన్ఫెక్షన్లకీ వీటిని మందుగా వాడతారు.కొన్నిచోట్ల ఆకుల రసాన్ని హృద్రోగాలకు ఔషదంగా ఉపయోగిస్తారు.బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ జ్వరము వచ్చినపుడు వాడితే ప్లేట్లెట్లు కౌంటు పెరగడానికి పనిచేస్తుంది.డయాబెటిస్ కారణంగా వచ్చే హృద్రోగాల్ని పచ్చి బొప్పాయి తగ్గిస్తుంది.బొప్పాయిలోని పపైన్‌ను ట్యాబ్లెట్‌గా రూపొందించి జీర్ణసంబంధ సమస్యలకు మందుగా వాడుతున్నారు.ఈ పపైన్ గాయాల్ని మాన్పుతుంది. ఎలర్జీల్ని తగ్గిస్తుంది. అందుకే గాయాలమీదా పుండ్లపైనా బొప్పాయి పండు గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి.పులియబెట్టిన బొప్పాయి నుంచి పపైన్ ఆయింట్‌మెంట్ తయారుచేస్తారు.నొప్పి నివారిణిగానూ ( పెయిన్‌కిల్లర్) పపైన్ గొప్పదే. అందుకే నరాలమీద ఒత్తిడిని తగ్గించేందుకూ వెన్నుపూసలు జారినప్పుడూ దీన్ని ఇంజెక్ట్ చేస్తారు.బొప్పాయి హెమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది తెలుగు నాట పచ్చి బొప్పయి కాయతో వంటలు అంతగా ఇష్ట పడరు గాని ఈశాన్య భారతంలో వంటలకు ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన వంకాయ, బీరకాయ, సొరకాయల్లాగానె బొప్పాయి కాయిని కూర గాయగా పరిగణించి విరివిగా అమ్ముతారు.
**విశేషాలు
ఆసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో బొప్పాయి పండులోని గింజల్ని ఎండబెట్టి మిరియాలకు బదులుగా వాడతారుబొప్పాయి ఆకుల్ని ఉడికించి పాలకూరలా తింటుంటారుశ్రీలంక, భారత్, పాకిస్థాన్… వంటి దేశాల్లో గర్భనిరోధానికీ, గర్భస్రావానికీ బొప్పాయిని వాడతారుప్రస్తుతం బొప్పాయిని హవాయ్‌లో ఎక్కువగా పండిస్తున్నారు.
మెక్సికన్లు దీన్ని ట్రీ మెలన్ అనీ పాపా అనీ పిలుస్తారు.పలకబారిన కాయల్ని గది ఉష్ణోగ్రత దగ్గర ఐదారు రోజులపాటు ఉంచితే బాగా పండుతాయి.మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని ఉత్తరభాగంలో, మెక్సికోలో ఎక్కువగా పండే బొప్పాయి స్పానిష్, పోర్చుగీస్ యాత్రికుల ద్వారా ఇతర ప్రాంతాలకు పరిచయమైందిగతంలో బొప్పాయి పండ్లను తినడానికి గాని, వాటిని పెంచ డానికి గాని ప్రజలు/రైతులు అంతగా ఇష్ట పడే వారు కాదు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా తింటున్నందున పందిస్తున్నారు.
బొప్పాయి చలువ చేస్తుంది
Related tags :