శ్రీవారి ఆలయంలో వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో రథసప్తమి వేడుకలు మొదలయ్యాయి. ఈ పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో మొదలై చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి. ఉదయం 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై, 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు స్వామివారికి చక్రస్నానం చేయించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై, సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై, రాత్రి 8 గంటల నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు
Related tags :