ప్రేమించాలంటూ యువతికి తుపాకీ చూపి బెదిరింపులకు పాల్పడిన ఓ యువకుడిని సికింద్రాబాద్‌లో స్థానికులు చితకబాదారు. దమ్మాయిగూడలోని సాయిబాబానగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థి అభిషేక్.. కళాశాలలో చదువుతున్న ఓ యువతిని ప్రేమించాలంటూ వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈరోజు ఆ యువతి తన సోదరుడితో కలిసి వెళుతుండగా సాకేత్ టవర్స్ వద్ద వారిని అడ్డగించి ఎయిర్‌గన్‌తో బెదిరించాడు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే స్పందించి అభిషేక్‌ను చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న అభిషేక్.. కొన్ని రోజులుగా యువతికి వాట్సాప్‌లో సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడు. ప్రేమించాలంటూ యువతిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
తుపాకీ చూపెట్టాడు. తన్నులు తిన్నాడు.
Related tags :