Politics

ముఖ్యమంత్రిగా చేయమంటే చేస్తా

ముఖ్యమంత్రిగా చేయమంటే చేస్తా

త్వరలో భాజపాలో చేరిక ద్వారా రాజకీయాల్లో అడుగుపెడతానంటూ ప్రకటించిన ‘మెట్రో మ్యాన్‌’ శ్రీధరన్‌.. కేరళలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. పార్టీ నిర్ణయం మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తానని.. ఒకవేళ పార్టీ కోరితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున కృషి చేస్తానని వివరించారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భాజపాలో చేరడానికి గల కారణాన్ని వివరించారు.