శ్రీశైలం, కర్నూలు జిల్లా
మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన- ఈ ఓ కే యస్ రామారావు.
*భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించవలెను
*స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది స్పర్శ దర్శనం ఉండదు
*పాతాళ గంగలో పుణ్యస్నానం లకు అవకాశం లేదు
*రథోత్సవము, తెప్పోత్సవం నిర్వహించబడును
*కాలినడకన వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం.
శ్రీశైలంక్షేత్ర పరిధిలోని క్యూలైన్లు, వసతి ఏర్పాట్లను పరిశీలించారు, అలాగే భక్తులు కాలినడకన వచ్చే పెచ్చేరువు అటవీ మార్గాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మార్చి 4వ తేదీ నుండి 14వ తేదీ వరకు శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ
బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ,
మహాశివరాత్రి నాడు ప్రాభోత్సవం, ఆ మరుసటి రోజు రథోత్సవం, తెప్పోత్సవం యధావిధిగా జరిపించబడును కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వీటిని నిర్వహించడం జరుగుతుందని ఈవో తెలిపారు.
అయితే కోవిడ్ నిబంధనల మేరకు ఈ సంవత్సరం స్వామి వార్ల స్పర్శ దర్శనానికి కి అవకాశం ఉండదన్నారు భక్తులందరికీ కూడా ప్రస్తుతం ఆచరణలో ఉన్నట్టుగానే స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనల మేరకు పాతాళ గంగలో పుణ్యస్నానాలకు అవకాశం ఉండదని తెలిపారు.
అటవీ శాఖ సహకారంతో కాలినడకన పాదయాత్ర తో వచ్చే భక్తుల సౌకర్యార్థం కూడా అవసరమైన ఏర్పాట్లు చేయబడతాయి అని తెలిపారు