ScienceAndTech

నాన్‌స్టిక్ పెనం వెనుక కథ ఇది

నాన్‌స్టిక్ పెనం వెనుక కథ ఇది

వంటగదిలోని పెనం అంటే ఇప్పటితరం ఎంటబ్బా అది అంటుంది.ప్యాన్ అంటే ఒహో ఇదేనా అంటారు.

వంటగదిలోని చాలా మాటలను ప్యాషన్ మాయలోపడి మరచిపోతున్నారు. చాల మందికి కవ్వం, తిరుగలి (విసుర్రాయి), అటక, కూటికుండ, తెడ్డు, మసిగుడ్డ, పొగగొట్టం (ఊదురుగొట్టం), రుబ్బురోలు, రోలుబండ, రోకలి,రోకలిబండ, కుదురు, ఉట్టి, చట్టి, బాన, పొంత, మరచెంబు, బాణలి, ఇడ్డెన, మూకుడు, ఎసరు గాలించడం, దంచడం (మొగుడ్ని కాదులేండి ) వగైరాలన్ని నామోషి పేరుతో పలకటంలేదు. కొందరికైతే తెలియను కూడా తెలియదు. దీనికి కారణం టీవీలలో వచ్చే వంటావార్పు కార్యక్రమాల భాష కూడా కావచ్చు.

దయచేసి తెలుగును మరువొద్దు.

నాన్ స్టిక్ పెనం మన వంట గదుల్లో చేరి ఇప్పటికి 65 సం॥రాలు దాటిపోయింది.నాన్ స్టిక్ పెనం లేని ఇల్లు లేదంటే నమ్మలేం. ఎందుకంటే దాని విలువ, వంటలరుచి, అది ఇచ్చే పొదుపు అలాంటిది మరి.

1938 లో అమెరికాలోని డూపాంట్ కంపెని Dupont company టెప్లాన్ ( Teflon) అనే పదార్ధాన్ని కనుగొంది. అప్పట్లో Dupont కర్మాగారాలలో వేడి తగ్గించి శీతలీకరణకు ప్రయోగాలు చేస్తుంటే అనుకోకుండా, Poly Tetra Fluro Ehylene (PTTE) కనుకొంది. ఇదే టెప్లాన్ మొదటి రూపం.

ఇది లోహాలపైన రాస్తే ఇతర పదార్ధాలు అతుక్కొనేవికావు.మొదట్లో డూపాంట్ కంపెనీ బ్రెడ్ తయారీ పెనంపైన మాత్రమే దీనిని ఉపయోగించింది.

1950లో ఫ్రెంచి దేశానికి చెందిన Marc Gregoire అనే ఇంజనీరు ఈ టెప్లాన్ గురించి విన్నాడు. ఈ పదార్ధాన్ని కొంత సంపాదించి అల్యూమినియం పాత్రలపై ఉపయోగించాడు. దీని జారుడు స్వభావం బాగా నచ్చడంతో చేపల వలలో ఉపయోగించాడు.

వంట పాత్రలపై ఉన్న జిడ్డును కడగలేకపోతున్నాను. ఇంటి వంట పాత్రలపై దీనిని పూయవచ్చుకదా అని ఓ రోజు అడిగింది. భార్యమాట కాదనలేక (ఏ మొగుడు కాదనడనుకోండి) వంట పాత్రలపైనా, పెనాలపై Teflon ప్రయోగించి సఫలీకృతుడైనాడు.ఆరోగ్యానికి హాని లేదని గుర్తించిన ప్రభుత్వం ఇతని పేరున పేటెంట్ మంజురూచేసింది.

ప్రజలు ఈ Teflon పెనాలను బాగా ఆదరించారు.1958 సం॥లోనే భార్య భర్తలిద్దరు కలిసి కోటి లక్షల నాన్ స్టిక్ పెనాలను ప్రపంచ వ్యాప్తంగా అమ్మారు.

అమెరికాలో Thomas hardie అనే వ్యక్తి 1960లో T- fal అనే కంపెనీ ద్వారా ఈ పెనాలను ప్రాచుర్యంలోనికి తీసుకువచ్చాడు.

అలా ఇలా దేశాలలో అమలవుతూ భారతదేశానికి 1985 నాటికి ఈ non stick Pan చేరుకోని వంట సామ్రాజ్యానికి మరో రాణిఅయింది.

మరి మొదటి రాణి ఎవరనుకొన్నారు? గృహలక్ష్మే కదా!.