NRI-NRT

తానాలో చిరునామాల గందరగోళంపై అయిదుగురు సభ్యుల కమిటీ

TANA Membership Verification Committee Announced

తానాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 4వేలకు పైగా సభ్యుల చిరునామాలకు సంబంధించి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది చిరునామాల్లో తేడాలు ఏర్పడటం, ఒకే చిరునామాలో 20-30మంది ఉండటం, కొంతమంది అమెరికాలో లేనప్పటికీ వారి చిరునామాలు అమెరికాలో ఉండటం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ చిరునామాల గందరగోళం గురించి క్షుణ్ణంగా తనిఖీ చేసి ఒక నివేదిక రూపొందించేందుకు అయిదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తానా కార్యదర్శి పొట్లూరి రవి, సహాయ కార్యదర్శి కొల్లా అశోక్‌బాబు, తానా మాజీ అధ్యక్షుడు డా.జంపాల చౌదరి, డా. బండ్ల హనుమయ్య, తానా మాజీ కార్యదర్శి వెన్నం మురళీలతో కూడిన కమిటీని రూపొందించారు. వీరంతా తానాలో చిరునామాలు సరిగా లేని 4వేల సభ్యుల వివరాలను తనిఖీ చేసి నివేదికను బోర్డుకు తదుపరి చర్యలకు ప్రతిపాదించనున్నారు.