Politics

ఆళ్లకు గట్టిదెబ్బ కొట్టిన పెదకాకాని ఓటర్లు

ఆళ్లకు గట్టిదెబ్బ కొట్టిన పెదకాకాని ఓటర్లు

నారా లోకేష్‍ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి పంచాయితీ ఎన్నికలలో సొంత గ్రామ ప్రజలే ఆయన బలపరిచిన అభ్యర్దులను ఓడించి షాక్‍ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఆళ్ల సొంత గ్రామం అయిన పెదకాకాని లేదు. ఏదో స్వగ్రామం అని అక్కడకు వెళుతుంటామే తప్ప.. స్థానిక సర్పంచ్‍ ఓటమితో తనకు ఎలాంటి సంబందం లేదని ముందు ముందు ఎమ్మెల్యే ఆళ్ల బుకాయించినా.. సర్పంచ్‍ గెలుపు కోసం ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కూడా నానా తంటాలు పడ్డారని రాజకీయ నేతలు అందరికీ తెలుసు. మంత్రి పదవి ఆశిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి సొంత గ్రామ ప్రజలే ఎదురు దెబ్బ కొట్టడంతో ఆయన సిఎం జగన్‍ రెడ్డికి తన ముఖాన్ని ఏ విధంగా చూపించగలుగుతారు అని అధికార పార్టీ నేతలే వ్యగ్యంగా అంటున్నారు.