Business

స్టాక్ మార్కెట్లు ఢమాల్-వాణిజ్యం

స్టాక్ మార్కెట్లు ఢమాల్-వాణిజ్యం

* దేశవ్యాప్తంగా ‘బైక్‌ టాక్సీ’ సేవలందిస్తున్న ఆన్‌లైన్‌ సంస్థ రాపిడో తమ వినియోగదారులకు మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వారు వివిధ ప్రాంతాల్లో ఆగి, తమ పనులు ముగించుకునేందుకు వీలుగా ‘మల్టీపాయింట్‌ ట్రిప్‌’ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఆ సంస్థ నేడు ప్రకటించింది. తమ సేవలు హైదరాబాద్‌తో సహా దిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, జైపూర్‌లలో అందుబాలులోకి వస్తాయని వివరించింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నాటి ట్రేడింగ్‌లో భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఉదయం ఊగిసలాటతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు క్రమంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో బడ్జెట్‌ తర్వాత కొనసాగిన ర్యాలీ నేపథ్యంలో వచ్చిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల కీలక మార్క్‌ (సెన్సెక్స్‌ 50,000; నిఫ్టీ 15,000)ను అందుకున్న సూచీలు వాటిని కోల్పోయాయి.

* కారు రుణం.. ఇది కొత్త కారు కొన‌డానికి ఉత్సాహం క‌లిగిస్తుంది. ఇది అప్‌గ్రేడ్ అయినా, మొద‌టి కారు అయినా లేదా కుటుంబానికి మ‌రొక కారు అయినా, కార‌ణం ఏమైన‌ప్ప‌టికీ, కారు లోన్ కొనుగోలును సుల‌భ‌త‌రం చేస్తుంది. కారు కొన‌డానికి రుణాలు ఇచ్చే బ్యాంకులు సాధార‌ణంగా 3 నుండి 5 సంవ‌త్స‌రాల కాల ప‌రిమితితో రుణాలు ఇస్తాయి. కానీ, కొన్ని రుణ సంస్థ‌లు 7 సంవ‌త్స‌రాల కాల ప‌రిమితి వ‌ర‌కూ కూడా రుణాలు ఇవ్వ‌వ‌చ్చు. ఎక్కువ కాలం రుణం అంటే చిన్న స‌మాన‌మైన నెల‌వారీ వాయిదాలు (ఈఎంఐలు) కారును మ‌రింత స‌ర‌స‌మైన‌దిగా అనిపిస్తుంది. కానీ, మొత్తం మీద మీరు వ‌డ్డీగా ఎక్కువ చెల్లిస్తారు. కారు త‌రుగుద‌ల ఆస్తి కూడా. కాబ‌ట్టి పెద్ద రుణం, ఎక్కువ కాల ప‌రిమితితో కూడిన రుణం తీసుకోక‌పోవ‌డ‌మే మంచింది. మ‌రీ త‌క్కువ కాలానికి రుణం తీసుకుంటే ఎక్కువ ఈఎంఐ ప‌డుతుంది. టైమ్‌కి రుణ వాయిదా క‌ట్ట‌క‌పోతే క్రెడిట్ రిపోర్ట్‌పై మ‌చ్చ ప‌డుతుంది. రుణాన్ని ఎంత తీసుకోవాలి, ఎంత కాల ప‌రిమితికి తీసుకోవాలి అనేది ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి. కొంత‌మంది రుణ‌దాత‌లు కారు యొక్క పూర్తి ఎక్స్‌-షోరూమ్ ధ‌ర మీద రుణం ఇస్తారు. మ‌రికొంద‌రు కారు ధ‌ర‌లో 80% వ‌ర‌కు రుణం ఇవ్వ‌వ‌చ్చు.

* సోమవారం ఊగిసలాటతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు క్రమంగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో గత వారం ఆరంభంలో వచ్చి పడిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఈ క్రమంలో నిఫ్టీ 15,000 పాయింట్ల కీలక దశను కోల్పోయింది. సెన్సెక్స్‌ సైతం 50వేల పాయింట్ల దిగువకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం 50,936 వద్ద స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ స్వల్ప కాలంపాటు ఊగిసలాటకు లోనై 50,975 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. కానీ, ఏ దశలోనూ మద్దతు లభించకపోవడంతో అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. ఓ దశలో 871 పాయింట్లు కోల్పోయి 50,018 వద్ద కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. 14,999 వద్ద స్వల్ప లాభంతో ఆరంభమై.. 14,754 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మధ్యాహ్నం 1:12 గంటల సమయానికి సెన్సెక్స్‌ 818 పాయింట్లు నష్టపోయి 50,069 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ ఏకంగా 212 పాయింట్లు కోల్పోయి 14,769 వద్ద ట్రేడవుతోంది.