* దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబయిలోని ఓ హోటల్‌లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు శవపరీక్ష కోసం ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన దేల్కర్ 2019లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
* వికారాబాద్:జిల్లాలోని పెద్దేముల్ మండలంలో దారుణ హత్య జరిగింది. మాజీ ఎంపీపీ భర్త వీరప్ప దారుణ హత్యకు గురయ్యారు.గర్తు తెలియని దుండగులు వీరప్పను రాళ్లతో దాడి చేసి అతికిరాతకంగా హత్య చేశారు.ఈ ఘటన పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్లో చోటు చేసుకుంది.ఈ హత్యకు రాజకీయ కక్షలేనని కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.
* మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసుపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు.అఫిడవిట్ ను పరిశీలించాక తీర్పు వెల్లడిస్తామన్న సుప్రీంకోర్టు.న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు అడగడం క్రిమినల్ చర్య కాదన్న ఈశ్వరయ్య తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్.ఈశ్వరయ్య సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందన్న జడ్జీ రామకృష్ణ తరపు న్యాయవాది కపిల్ సిబల్.
* అక్రమంగా తరలిస్తున్న 16 లక్షల రూపాయల విలువైన మద్యం స్వాధీనంబిస్లరి వాటర్ బాటిల్స్ మద్య అక్రమ రవాణాగోవా నుంచి శావల్యాపురం మండలం కారుమంచి కి తరలిస్తున్నట్లు సమాచారంఅక్రమ వ్యాపారాలకు నిలయంగా మారిన నియోజకవర్గంలోని పలు గ్రామాలుగుంటూరు జిల్లా చీకటీగలపాలేం సమిపంలో తెల్లవారుజామున యస్ఇబి అధికారులకు వచ్చిన సమాచారం నేపథ్యంలో తనిఖీలు నిర్వహించగా గోవా నుంచి శావల్యాపురం మండలం కారుమంచి కి ఆఫ్ 28 త్చ్ 9339 నెంబర్ గల లారీలో బిస్లరి వాటర్ బాటిల్స్ మద్య అక్రమంగా తరలిస్తున్న సుమారు 16 లక్షల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని,లారీ డ్రైవర్,క్లీనర్, మరియు కారుమంచి, పిట్టంబండ, కనమర్లపూడి కి చెందిన నలుగురుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన యస్ఇబి అధికారులు.
* రాజమండ్రిలో అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్న రౌడీ మూకలు….వైయస్సార్ సిపి నాయకులు దొండపాటి శ్రీనుపై ధవళేశ్వరం గర్ల్స్ హై స్కూల్ వద్ద హత్యాయత్నం.గర్ల్స్ హై స్కూల్ వద్ద అపార్ట్మెంట్ వద్ద ఉండగా కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు కళ్లలో కారం కొట్టి కత్తులతో దాడి చేసిన వైనం.చికిత్స నిమిత్తం డెల్టా ఆసుపత్రికి తరలించిన ధవళేశ్వరం పోలీసులు, పరిస్థితి విషమం.