Business

ఇండియాలో పెట్రో మంటలు-వాణిజ్యం

ఇండియాలో పెట్రో మంటలు-వాణిజ్యం

* దేశవ్యాప్తంగా ఇంధన ధరల మంటలు కొనసాగుతున్నాయి.రెండు రోజుల విరామం తరువాత మంగళవారం పెట్రోల్, డీజిల్ మళ్లీ పరుగందుకున్నాయి.పెట్రోలుపై 25 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెరిగింది.దీంతో ఈ నెలలో ఇప్పటివరకు పెట్రోల్‌ ధరలు 15 సార్లు పెరిగి రికార్డు స్థాయిల వద్ద వాహనదారులను బెంబే లెత్తిస్తున్నాయి.ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థల తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటరుకు రూ.90.83,డీజిల్‌ ధర రూ. 81.32 కు చేరింది.ముంబైలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.97.34కు చేరగా, డీజిల్‌ రూ.88.44 వద్ద ఉందిపలునగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకుచెన్నైలో పెట్రోల్‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.31కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.12, డీజిల్‌ రూ.84.20హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.54, డీజిల్‌ రూ.88.69అమరావతిలో పెట్రోల్‌ రూ.97.08, డీజిల్‌ రూ.90.69

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత మంగళవారం భేటీ అయిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌ సమావేశ మందిరంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.గతంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

* ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. ఒక్క ట్వీట్‌తో భారీగా నష్టపోయారు. బిట్‌కాయిన్‌లపై ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌ కావడంతో కేవలం ఒకే ఒక్క రోజులో ఆయన 15 బిలియన్‌ డాలర్లు కోల్పోయారు.

* గుజరాత్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘హెరాన్బా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ పంటల రక్షణకు సంబంధించిన రసాయనాలను తయారు చేస్తుంది. సొంతంగా క్రిమి సంహారిణిలు, కలుపు సంహారిణిలు, శిలీంద్ర నాశకాలను విక్రయిస్తుంటుంది. అలాగే ఇతర అగ్రో కెమికల్‌ కంపెనీలకు ముడి రసాయనాలను తయారు చేసి విక్రయిస్తుంటుంది. భారత్‌లో సింథటిక్ పైరెథ్రాయిడ్ల తయారీలో హెరాన్బాదే అగ్రస్థానం. భవిష్యత్తు విస్తరణ కోసం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌(ఐపీఓ)కు వచ్చిన ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. రూ.60 కోట్ల విలువ చేసే షేర్లు తాజా ఇష్యూ కాగా.. 90.15 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తున్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. నిన్నటి భారీ నష్టాల నుంచి ఉదయమే తేరుకున్న మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. అయినప్పటికీ.. కీలక రంగాల మద్దతు లభించడంతో కొంత సానుకూలంగా కదలాడాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం సూచీలపై ప్రభావం చూపింది. ఉదయం సెన్సెక్స్‌ 50,104 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిఫ్టీ 14,782 వద్ద ఆరంభమైంది. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఓ దశలో సెన్సెక్స్‌ 49,666 వద్ద, నిప్టీ 14,655 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకాయి. కానీ లోహ, స్థిరాస్తి, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల మద్దతుతో వెంటనే కోలుకుని సెన్సెక్స్‌ 50,316 వద్ద, నిఫ్టీ 14,849 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరాయి. తిరిగి అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో చివరకు సెన్సెక్స్‌ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 49,751 వద్ద ముగిసింది. నిఫ్టీ 32 పాయింట్లు ఎగబాకి 14,707 వద్ద స్థిరపడింది. మొత్తంగా ఈరోజు ఈరోజు సూచీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.46 వద్ద నిలిచింది.

* ఈ రైల్‌టెల్ ఐపీఓలో వాటా కేటాయింపు బ్రోక‌రేజ్‌ల ప్ర‌కారం ఈ రోజు ఖ‌రార‌య్యే అవ‌కాశ‌ముంది. రైల్‌టెల్ ఐపీఓకు ధ‌ర‌ఖాస్తుదారుల కేటాయింపు స్థితిని కెఫిన్ టెక్నాల‌జీస్ వెబ్‌సైట్‌లో చెక్ చేయ‌వ‌చ్చు. ఇది షేర్‌ల వాటా కేటాయింపుల‌ను, రిఫండ్‌ల‌ను నిర్వ‌హిస్తుంది. ఈ వివ‌రాలు బిఎస్ఈ వెబ్‌సైట్‌లో కూడా ఉంటాయి. రైల్‌టెల్ షేర్ల జాబితా ఫిబ్ర‌వ‌రి 26న ఉంటుంది.