Food

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గడ్డి పచ్చడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గడ్డి పచ్చడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం పంచాయతీ పరిధిలోని గుండ్లమడుగు గ్రామస్థులు వారానికి మూడు నాలుగు రోజులు ఆహారంలో గడ్డిని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న 30 కుటుంబాలూ అన్నంలోకి గడ్డి కూర ఉంటే విందు భోజనంగా భావిస్తారు. పచ్చి గడ్డిని ఇష్టంగా కూర వండుకోవడంతో పాటు పప్పులో వేసుకుంటారు. పచ్చడి కూడా చేసుకుంటారు. ఎండిన గడ్డిని పొడి చేసుకొని నీటితో కలిపి తాగుతారు. అది బలవర్థకమైన ఆహారం అని వారి నమ్మకం. ఈ విషయమై మణుగూరు మండల వైద్యాధికారి మౌనిక మాట్లాడుతూ.. గోదావరి తీరంలో పారే వాగుల ఒడ్డున ఈ గడ్డి ఎక్కువగా లభిస్తుందని, ఆకుకూరల మాదిరిగానే ఇందులో పోషక విలువలుంటాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఈ గడ్డిని ఈనకూరగా పిలుస్తారని, ఇది లిలియేసి జాతికి చెందినదని జిల్లా ఉద్యాన అధికారి మరియన్న తెలిపారు. ఈ గ్రాసంలో బి12 విటమిన్‌తో పాటు ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయని, దీన్ని తినడం వల్ల ప్రయోజనాలే ఉంటాయన్నారు. నీటి నిల్వ ప్రాంతాల్లో ఇది ఏపుగా పెరుగుతుందని చెప్పారు.