Movies

మనాలిలో కంగనా హోటల్

మనాలిలో  కంగనా హోటల్

బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ కొత్త అవతారం ఎత్తనుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె త్వరలోనే వ్యాపారవేత్తగా మారనుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలమైన మనాలిలో ఆమె ఒక కేఫ్‌, రెస్టారంట్‌ ప్రారంభించనుంది. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుందామె. అంతేకాదు.. దీన్ని తన డ్రీమ్‌ వెంచర్‌ అని చెప్పుకొచ్చింది. కొత్త వ్యాపారానికి సంబంధించి తన బృందంతో చర్చిస్తున్నప్పటి ఫొటోలను కూడా పంచుకుందామె.