శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస శాసనసభ్యుడు తమ్మినేని సీతారాం బాటలోనే ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ నడుస్తున్నారు. మీరు పేరుకే గ్రామ సర్పంచ్‍లు. అధికారం చెలాయించేది మేమే తస్మాత్ జాగ్రత్త అని టిడిపి పంచాయితీ సర్పంచ్‍లను బాహాటంగానే నాగ్ హెచ్చరించారు. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. నాగ్ వ్యాఖ్యలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మా నాగ్.. తండ్రి తమ్మినేని సీతారాం కన్నా చాలా పవర్‌ఫుల్ అని అధికార నేతలు, అమాత్యుల కుటుంబసభ్యులు, అధికార ప్రజాప్రతినిధులు గొప్పగా చెబుతున్నారట.
స్పీకర్ కొడుకు గట్టోడే!
Related tags :