Business

సొంత డిజిటల్ కరెన్సీ తయారీలో RBI నిమగ్నం-వాణిజ్యం

సొంత డిజిటల్ కరెన్సీ తయారీలో RBI నిమగ్నం-వాణిజ్యం

* ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ భారీ స్థాయిలో పెరుగుతోన్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టోకరెన్సీలు ప్రభావితం చేసే అవకాశాలున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. క్రిప్టోకరెన్సీల విలువ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శక్తికాంత దాస్‌ ఈ విధంగా మాట్లాడారు. దేశంలో అధికారికంగా డిజిటల్‌ కరెన్సీ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోన్న సమయంలో ఆర్‌బీఐ గవర్నర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీపై పూర్తిగా నిషేధించి, సొంత డిజిటల్‌ కరెన్సీ తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సొంతంగా డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరోసారి స్పష్టంచేశారు. దీంతో ఇప్పటికే చైనాలో ఉన్న ఎలక్ట్రానిక్‌ యువాన్‌తో పాటు డిజిటల్‌ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్‌ చేరుతుందని తెలిపారు. అయితే, ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని, ఇందుకోసం కావాల్సిన సాంకేతికత, విధానపరమైన అంశాలపై ఆర్‌బీఐ పనిచేస్తోందని అన్నారు. బిట్‌కాయిన్‌ విలువ ఎన్నడూ లేనంతగా ఇటీవల పెరగడంతో క్రిప్టోకరెన్సీకి ఆదరణ పెరిగింది. నోట్ల రద్దు తర్వాత దేశీయంగానూ ఈ తరహా కరెన్సీ వినియోగం మరింత ఎక్కువ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని భావించిన ఆర్‌బీఐ.. 2018లో వీటిని నిషేధించింది. అయితే, ఆర్‌బీఐ ఉత్తర్వులను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేసింది. ప్రైవేటు క్రిప్టో కరెన్సీకి ముకుతాడు వేసి, దేశంలో సొంతంగా డిజిటల్‌ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమయ్యింది.

* జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్యూ మంగళవారం ఆర్‌ 18 క్లాసిక్‌ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్‌ షోరూం ధరను రూ.24 లక్షలు. ఈ బైక్‌ ఇంజిన్‌ సామర్థ్యం 1902 సీసీగా ఉంది. ఇందులో 6 గేర్లు ఉన్నాయి. రెయిన్‌, రోల్‌, రాక్‌ మోడ్స్‌ అనే మూడు రైడింగ్‌ మోడ్‌లను కలిగి ఉంది. పొడవైన విండ్‌ స్కీన్‌ ప్యాసింజర్‌ సీట్‌, ఎల్‌ఈడీ అదనపు హెడ్ లైట్లు, స్యాడిల్‌ బ్యాగ్స్ 16-ఇంచ్‌ ఫ్రంట్‌ వీల్ తో పాటు ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ డిస్‌ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఇంజిన్‌ ట్రక్‌ కంట్రోల్‌, హిల్‌ స్వార్డ్‌ కంట్రోల్‌. కీలెస్‌ రైడ్‌ సిస్టం, ఎలక్రానిక్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ లాంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది. ఈ మోటార్‌ సైకిల్‌ సీబీయూ(కంప్లీట్లే బిల్డ్‌ యూనిట్‌) మార్గం ద్వారా భారత్‌లకి దిగుమతి అవుతుందని, డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని బీఎండబ్య్యూ తెలిపింది.

* పెట్రోల్‌ ధరల సెగ.. 26న భారత్‌ బంద్‌8 కోట్ల మంది పాల్గొనే అవకాశంరైతుల మాదిరి జాతీయ రహదారుల దిగ్బంధానికి ప్లాన్‌పెట్రోలియం ధరలు, ఈ – వే బిల్లు నిబంధనలపై నిరసనన్యూఢిల్లీ: నిరాటంకంగా పెరుగుతూ సెంచరీ మార్క్‌ దాటుతున్న పెట్రోల్‌ ధర.. దానికి అనుగుణంగా పోటీ పడుతూ పెరుగుతున్న డీజిల్‌ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు వారాలుగా పెరుగుతున్న ధరలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా తాజాగా ధరల పెంపుపై లారీ యజమానులు ఆందోళనకు దిగారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా శుక్రవారం (ఫిబ్రవరి 26) భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

* డబ్బులు డ్రా చేసినా.. అకౌంట్‌ ఏదో తెలియదు. ఏటీఎం మెషిన్‌లో సైబర్‌ డివైజ్‌ను అమర్చి లక్షలాది రూపాయలు నగదు డ్రా చేసే విదేశీ సైబర్‌ దొంగల గ్యాంగ్‌ ఐటీ సిటీలో ప్రవేశించింది. బ్యాంకు అధికారులకు ఇది పెద్ద సవాల్‌గా మారింది. ఏటీఎం మెషిన్‌ పాస్‌వర్డ్‌ను దొంగిలించి క్రెడిట్, డెబిట్‌కార్డ్స్‌ డేటా తస్కరించి ఏటీఎం కేంద్రాల్లో నగదు దోచేస్తున్నారు.

* ఈ ఏడాది భారత్‌లో వేతనాలు సగటున 7.7 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. బ్రిక్‌ దేశాలన్నింటిలోనూ భారత్‌లోనే వేతనాల పెంపు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 2020లో భారత్‌లో వేతనాలు సగటున 6.1 శాతం మేర పెరిగాయని వివరించింది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్‌ పీఎల్‌సీ ఈ నివేదికను రూపొందించింది. దేశవ్యాప్తంగా 20 పరిశ్రామిక రంగాల్లోని 1,200 కంపెనీలపై జరిపిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ‘వ్యాపార కార్యకలాపాలపై కరోనా ప్రభావం ఏమేరకు పడిందనే విషయంపై పూర్తి అవగాహన వచ్చాక వేతనాల పెంపు అంశాన్ని కంపెనీలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే పెంచిన వేతనం పూర్తిగా ఉద్యోగుల చేతికి ఇవ్వకుండా, అందులో కొంత డబ్బును కొత్త వేతన నిర్వచనం ప్రకారం ఎక్కువ మొత్తంలో భవిష్య నిధి చందా కట్టేందుకు వాడే అవకాశాలూ ఉన్నాయ’ని ఎయాన్‌ ఇండియా (పర్‌ఫెర్మాన్స్, ప్రోత్సాహకాల విభాగం) సీఈఓ నితిన్‌ సేథి అన్నారు.

* 2020 సంవ‌త్స‌రంలో హైవేల‌లో టోల్ ప్లాజాల ద్వారా 2.6 ల‌క్ష‌ల మంది ఫాస్టాగ్ వినియోగ‌దారుల నుంచి త‌ప్పుగా వ‌సూలు చేసిన టోల్ ఛార్జీ రుసుమును తిరిగి చెల్లించ‌డానికి పేటీఎమ్‌ త‌న వినియోగ‌దారుల‌కు స‌హాయ‌ప‌డింది. వాహ‌నాన్ని త‌ప్పుగా గుర్తించ‌డం లేదా టోల్ ప్లాజాల ద్వారా పొర‌పాటుగా రెండుసార్లు ఛార్జ్ తీసుకోవ‌డం లాంటి త‌ప్పుడు వ‌సూళ్ల‌ను తిరిగి త్వ‌ర‌గా వాహ‌న య‌జ‌మానుల‌కు అందించ‌డానికి జ‌రిపే చెల్లింపులను సుల‌భ‌త‌రం చేసిన‌ట్లు పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఈ రోజు ప్ర‌క‌టించింది. ఇందుకుగాను పేటీఎమ్ చెల్లింపుల సంస్థ వేగ‌వంత‌మైన ప‌రిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఇది టోల్ ప్లాజాల్లో జ‌రిగే త‌ప్పుడు చెల్లింపుల‌ను వెంట‌నే గుర్తించి ప‌రిష్కారం చూపుతుంది.