Videos

రాజేంద్రప్రసాద్ ర్యాప్ సాంగ్

Tollywood Actor Rajendra Prasad Raps Telugu Song For New Movie

రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “క్లైమాక్స్” ను చూస్తే కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. తన రోల్ డిజైన్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్ నేడు విడుదల కాబడిన స్పెషల్ ర్యాప్ సాంగ్ ఖచ్చితంగా మంచి అంచనాలు ఈ చిత్రం నెలకొల్పుకుంది. రాజేష్ – నీద్వాన సంగీతం అందించిన “లక్ష్మి వచ్చింది” అనే లిరికల్ సాంగ్ ను మేకర్స్ ఇప్పుడు విడుదల చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సాంగ్ ను రాజేంద్ర ప్రసాద్ పాడడం అందులోను గుక్క తిప్పకుండా తెలుగు ర్యాప్ చెయ్యడం గమనార్హం. ఈ సినిమా దర్శకుడు భవాని శంకర్ కే నే రాసిన ఈ సాంగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. మొదటి సారి ర్యాప్ లో రాజేంద్ర ప్రసాద్ తన లైఫ్ లోకి వచ్చిన లక్ష్మి అనే పాత్ర కోసం చెప్తే తర్వాత వచ్చిన రెండు ర్యాప్ బిట్స్ లో కొన్ని నిజ జీవిత సమస్యలు అలాగే పాటించని విమర్శలు సూక్తులకు అద్దం పట్టేలా చాలా సహజంగా ఉన్నాయి. ఈ చిత్రంలో సాషా సింగ్, పృథ్వీ, శివశంకర్ మాస్టర్, రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా కైపస్ ఫిలిం ప్రొడక్షన్ వారు ఈ చిత్రంను నిర్మించారు.