* తితిదే ఆస్తులను కాపాడాలని న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.తితిదేకు చెందిన స్థిర, చర ఆస్తుల జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.ఆస్తులను అమ్మేందుకు తితిదేకు అధికారం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.ఆస్తుల వివరాలను ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో పెట్టినట్లు తితిదే తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.ఆస్తుల పరిరక్షణ కోసం హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ నియమించినట్లు వివరించారు.తితిదేకు చెందిన ఆస్తుల వివరాలు, పబ్లిక్ డొమైన్లో పెట్టిన ఆస్తుల వివరాలు, ఆస్తుల పరిరక్షణకు నియమించిన కమిటీ వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని తితిదేను న్యాయస్థానం ఆదేశించింది.
* శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ టికెట్ల కోటా విడుదలమార్చి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆన్లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను గురువారం ఉదయం 11 గంటలకు టిటిడి విడుదల చేసింది.ఈ సేవా టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇళ్ల నుండే వర్చువల్ విధానంలో ఈ సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది.భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా ఈ సేవల టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.కల్యాణోత్సవం టికెట్లు పొందిన గృహస్తులకు(ఇద్దరికి) ఆ టికెట్‌పై ఉచితంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు.
* పుష్య నక్షత్రం గురువారం వస్తే దాన్ని గురు పుష్య యోగా అంటారు. భారతీయ జ్యోతిషశాస్త్రం ప్రకారం.. తిథి, నక్షత్రం, శుభదినం లాంటివి శుభాలుగా భావిస్తారు. శుభదినాన మంచి కార్యక్రమాలు లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తుంటారు. ఎందుకంటే పవిత్రమైన సమయంలో నిర్వహించే ఎలాంటి పనులైన అనుకూల ఫలితాలు అందుకుంటాయని నమ్ముతారు. గురు పుష్య యోగ కూడా అలాంటి పవిత్రమైన రోజే. గురువారం నాడు పుష్య నక్షత్రం వస్తే గురుపుష్య యోగ అని అంటారు. 25.2.21 న గురు పుష్య యోగ రానున్నది.
* సనాతన ధర్మానికి వేదం ప్రమాణం : బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు.మానవాళి పురోభివృద్ధి సాధించాలంటే అన్ని కార్యక్రమాలు ధర్మబద్ధంగా జరగాలని, అలాంటి సనాతన ధర్మానికి వేదం ప్రమాణమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు.తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరుగుతున్న అఖండ ఋగ్వేద పారాయణంలో గురువారం శ్రీ చాగంటి పాల్గొన్నారు.ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉపన్యసిస్తూ వేదాలు అపౌరుషేయాలని, వీటిని ఎవరూ రచించలేదని, సాక్షాత్తు భగవంతుని స్వరూపమని తెలిపారు.వేదాలు చాలా శక్తిమంతవైనవని, ఇవి ఏకత్వాన్ని ప్రబోధిస్తాయని తెలిపారు. వేద విద్య అజ్ఞానాన్ని దూరం చేసి ఆత్మజ్ఞానాన్ని అందిస్తుందన్నారు.