శృంగార తారగా పేరొందిన నటి సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబెర్‌కు ముంబైలోని ఓ వ్యక్తి షాకిచ్చాడు. వెబెర్‌కు సంబంధించిన కారు నంబర్ తన కారుకు పెట్టుకుని ముంబైలో యథేచ్ఛగా తిరిగాడు. దీంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు వేశారు. అయితే డేనియల్‌కు సంబంధించిన కారు నంబర్ గుర్తించిన డ్రైవర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖుల కార్ల నంబర్లను తన కారుకు పెట్టుకుని తిరగడం అతడికి అలవాటు అని పోలీసులు తెలిపారు.
సన్నీ లియోనీ భర్తకు భారీ చలాన్లు
Related tags :