బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు తన పేరు మీద ఎవరో బోగస్ ఈ-మెయిళ్లు పంపుతున్నారంటూ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తులో ముంబయి క్రైం బ్రాంచి పోలీసులు క్రమంగా వేగం పెంచుతున్నారు. వాంగ్మూలం నమోదు చేసుకునేందుకుగాను శనివారం మధ్యాహ్నం కమిషనర్ కార్యాలయంలోని నేర నిఘా విభాగానికి (సీఐయూ) రావాల్సిందిగా వారు హృతిక్‌కు సమన్లు జారీ చేశారు. నకిలీ ఈ-మెయిళ్లపై ఆయన 2016లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు నత్తనడకన సాగుతోందంటూ ఆయన తరఫు న్యాయవాది గత ఏడాది డిసెంబరులో ముంబయి పోలీసు కమిషనర్‌ను సంప్రదించారు. దీంతో కేసును క్రైం బ్రాంచ్‌కు చెందిన సీఐయూకు బదిలీ చేశారు.
కంగనా కేసులో హృతిక్‌కు సమన్లు
Related tags :