భారత బాక్సర్ దీపక్ కుమార్ సంచలన ప్రదర్శన చేశాడు. స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో పురుషుల 52 కేజీల సెమీస్‌లో అతను.. ఒలింపిక్ ఛాంపియన్ జోరోవ్ (ఉజ్బెకిస్థాన్)కు షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన బౌట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన దీపక్ 4-1 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. మహిళల విభాగంలో భారత పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన జ్యోతి గులియా (51 కేజీలు), భాగ్యవతి కచారి (75 కేజీలు) తమ బౌట్లలో ఓడిపోయారు. జ్యోతి 0-5తో పెరిజోక్ (రొమేనియా) చేతిలో, భాగ్యవతి కూడా అంతే తేడాతో గుర్గెన్ (అర్మేనియా) చేతిలో పరాజయం చెందారు. పురుషుల 91 కేజీల పైన విభాగంలో మంజీత్ సింగ్ ఓటమి పాలయ్యాడు.
భారత బాక్సింగ్ సంచలనం…దీపక్

Related tags :