Politics

తెరాసకు పోటీ లేదు…ఉండదు-కేసీఆర్

తెరాసకు పోటీ లేదు…ఉండదు-కేసీఆర్

రాష్ట్రంలోని వరంగల్‌-నల్గొండ-ఖమ్మం, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌… ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సురభి వాణీదేవిల విజయం ఖాయమని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలోనూ 48.9 శాతం ఓట్లతో ఘనవిజయం సాధిస్తామని చెప్పారు. మూడు స్థానాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజలు ఎనలేని అభిమానంతో ఉన్నారు. మన రాష్ట్రం, మన ప్రభుత్వం అనే భావన వారిలో ఉంది. పట్టభద్ర ఎన్నికలు జరిగే ఆరు ఉమ్మడి జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయాలి. మంత్రులు ముందుండి వారిని నడిపించాలి. ఎక్కడా లోపాలు కనిపించరాదు. మేమే పోటీ చేస్తున్నామనే భావనతో ప్రతీ ఒక్కరూ విజయానికి కృషి చేయాలి. మంత్రులు.. ఆయా జిల్లాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు. శుక్రవారం ఆయన అందుబాటులో ఉన్న మంత్రులతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికపై విస్తృతంగా చర్చించారు.