ఏప్రిల్‌లో జరగనున్న 93వ ఆస్కార్ పురస్కార్ వేడుకల్లో భాగంగా ఉత్తమ చిత్రంగా నామినేషన్ దక్కించుకున్న 366 చిత్రాలను ఆస్కార్ అకాడెమీ ప్రకటించింది. ఇందులో సూర్య నటించిన తమిళ చిత్రం ‘సురారై పొట్రు’కి స్థానం దక్కింది. ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా సుధ కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒడిశా చిత్రం ‘కలిర అటిత’ కూడా ఈ జాబితాలో ఉంది. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆంగ్ల చిత్రం ‘ది వైట్ టైగర్’ కూడా ఈ జాబితాలో ఉంది. తుది జాబితాను మార్చి 15న ఆస్కార్ అకాడెమీ అధికారికంగా ప్రకటించనుంది.
ఆస్కార్ బరిలో సూర్యా సినిమా
Related tags :