NRI-NRT

డా.వేల్చేరుకు సాహిత్యా అకాడమీ గౌరవం

డా.వేల్చేరుకు సాహిత్యా అకాడమీ గౌరవం

రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త వేల్చేరు నారాయణరావు ‘ఆనరరీ ఫెలో ఆఫ్‌ సాహిత్య అకాడమీ’కి ఎంపికయ్యారు. అధ్యక్షుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ కంబార్‌ నేతృత్వంలో కేంద్ర సాహిత్య అకాడమీ సమావేశమై అరుదైన ఈ గౌరవానికి వేల్చేరు నారాయణరావును ఎంపిక చేసింది. సాహిత్య అకాడమీ ఆనరరీ ఫెలోషిప్‌ అన్నది దేశంలో సాహిత్య రంగంలో దక్కే అత్యున్నత గౌరవం. తెలుగు సాహిత్యం, దక్షిణభారత చరిత్ర, అనువాద రంగాలకు చేసిన సేవలకు గుర్తింపుగా నారాయణరావును దీనికి ఎంపిక చేశారు.