‘‘ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అలా అని ప్రపంచకప్, ఐపీఎల్ ఫైనల్ నేడు జరగట్లేదు. అయినా ఎంతో ముఖ్యమైనది. ఈ రోజుతో క్రికెట్ ఇన్నింగ్స్‌కు నేను ముగింపు పలుకుతున్నాను. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు ప్రకటిస్తున్నాను. అండగా నిలుస్తూ ప్రేమను పంచిన నా దేశానికి, కుటుంబానికి, స్నేహితులు, అభిమానులు, కోచ్‌లకు కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇలానే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా. నా క్రికెట్ కెరీర్‌లో అంతర్జాతీయ, దేశవాళీ, ఐపీఎల్ క్రికెట్ ఆడాను. ధోనీ సారథ్యంలో టీమిండియాకు, షేన్ వార్న్ కెప్టెన్సీలో ఐపీఎల్, జాకోబ్ మార్టిన్ నాయకత్వంలో రంజీ ట్రోఫీలో తొలిసారిగా ప్రాతినిధ్యం వహించాను. నాపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చిన వాళ్లకి ధన్యవాదాలు. ఇక గౌతం గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును రెండు సార్లు విజేతగా నిలిపాం. నా కెరీర్‌లో ఎదురైన అన్ని పరిస్థితుల్లోనూ అండగా నిలిచిన నా సోదరుడు ఇర్ఫాన్ పఠాన్‌కు కృతజ్ఞతలు’’ అని పఠాన్ అన్నాడు.
ఇక నేను వెళ్లొస్తా….
Related tags :