Politics

మార్చి 5న ఏపీ బంద్-తాజావార్తలు

మార్చి 5న ఏపీ బంద్-తాజావార్తలు

* మార్చి 5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర బంద్ కు సిపిఐ మద్దతు – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన తరుణమిది.కేంద్రం మెడలు వంచేందుకు ఆంధ్రులంతా ఏకం కావాలి.ఏపీకి బిజెపి చేస్తున్న ద్రోహాన్ని, కుట్రలను తిప్పికొట్టాలి.అన్ని రాజకీయ పక్షాలు, వర్తక, వాణిజ్య, ప్రజాసంఘాలు, అన్ని వర్గాల ప్రజలు మార్చి 5 బంద్ ను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

* మహమ్మారి కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మరోసారి పొడిగించింది. ఇంటర్నెషనల్ విమానాల రాకపోకలపై డీజీసీఏ ఇంతకుముందు విధించిన బ్యాన్ ఈ నెల 28తో ముగియనుంది.అయితే, తాజాగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం మరోసారి నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.కార్గో విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక ఫ్లైట్స్‌కు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.ప్రస్తుతం భారత్ సుమారు 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది.ఈ దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు సాగించే విమానాలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం గతేడాది మార్చి 25 నుంచి పూర్తిగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిషేధించిన విషయం తెలిసిందే.అనంతరం మే 25 నుంచి డొమెస్టిక్ విమానాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ, గత 11 నెలలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ అలాగే కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు నెల రోజుల పాటు ఈ నిషేధాన్ని పొడిగించడం గమనార్హం.

* దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. వరుసగా మూడో రోజు కొత్త కేసుల సంఖ్య 16వేలకు పైనే ఉంది. అయితే ఇందులో 86శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలో కొత్త కేసులు పెరిగినట్లు తెలిపింది.అత్యధికంగా మహారాష్ట్రలో 8,333 కేసులు బయటపడగా.. కేరళలో 3,671, పంజాబ్‌లో 622 మందికి కొత్తగా వైరస్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసులు కూడా పెరుగుతున్నట్లు తెలిపింది.మహారాష్ట్రలో ఫిబ్రవరి 14న 34,449 యాక్టివ్‌ కేసులుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 68,810కి పెరిగింది. అయితే కేరళలో మాత్రం క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతుండటం కాస్త ఊరటనిస్తోంది.

* తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తడంతో పాటు మూత్రపిండాల పనితీరు మందగించడంతో ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌మీద చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కొల్లూరి చిరంజీవి ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. చిరంజీవి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.10 లక్షలు తక్షణమే విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి కూతురు అజిత, ఇతర కుటుంబసభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డా. చిరంజీవి పుట్టినరోజునే ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని కేటీఆర్ ఆదుకోవడం ఎప్పటికీ మరిచిపోలేమని కుటుంబసభ్యులు తెలిపారు.

* మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల వేళ టికెట్ల పంచాయతీ టీడీపీకి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నానికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తలు అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం విజయవాడలో కలకలం రేపింది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఏర్పడిన వివాదం దీనికి కారణమని తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయవాడలోని కేశినేని నానికి సంబంధించిన కార్యాలయం ఎదుట కార్యకర్తలు ఆందోళన చేశారు.

* మధ్యప్రదేశ్‌కు చెందిన రిటైర్డు న్యాయమూర్తిపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసులను అంత తేలికగా తీసిపడేయలేమని, రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. బాధితురాలు ఫిర్యాదు వెనక్కి తీసుకున్నంత మాత్రాన, డిపార్టుమెంటల్‌ ఎంక్వైరీకి ఆదేశించకుండా హైకోర్టును అడ్డుకోవడం సాధ్యంకాదని పేర్కొంది. కాగా మధ్యప్రదేశ్‌లోని రిటైర్డు జిల్లా జడ్జిపై ఆయన జూనియర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే, అనివార్య కారణాల దృష్ట్యా కొన్నాళ్ల క్రితం ఆమె కేసు వాపసు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. లైంగిక వేధింపుల కేసులో మధ్యప్రదేశ్‌ హైకోర్టు సదరు జడ్జిపై ఇన్‌హౌజ్‌ డిపార్టుమెంటల్‌ ఎంక్వైరీకి ఆదేశించింది.

* ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా టీకాకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఒక్కో డోసు ధరను రూ.250గా నిర్ణయించింది. ఇందులో టీకా ధరతో పాటు, సర్వీస్‌ఛార్జి ఇమిడి ఉంటాయి. వ్యాక్సిన్‌ ధర రూ.150 కాగా.. సర్వీస్‌ ఛార్జిగా ఒక్కో వ్యక్తి నుంచి రూ.100 ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తాయని కేంద్రం తెలిపింది. కొవిడ్‌ టీకా రెండు డోసుల్లో వేసుకోవాల్సి ఉండడంతో ‘ప్రైవేటు’లో ఒక్కో వ్యక్తి రూ.500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే వ్యాక్సిన్‌కు అయ్యే ఖర్చును మాత్రం కేంద్రమే భరించనుంది.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 37,041 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 118 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ వల్ల గడిచిన 24 గంటల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,799కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,169కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 86 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,81,963కి చేరింది.

* న్యాయమూర్తుల పట్ల వ్యక్తిగత దూషణలకు దిగుతుండటం పట్ల కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అసహనం వ్యక్తం చేశారు. తమకు అనుకూలంగా తీర్పు రాని పక్షంలో కొందరు వ్యక్తులు న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని పరుష పదజాలంతో దూషించే ధోరణి ఇటీవల పెరిగిపోయిందన్నారు. పట్నాలో నూతనంగా నిర్మించిన హైకోర్టు నూతన భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

* తన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’తో అటు అందంలోనూ, ఇటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది లావణ్య త్రిపాఠి. తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. తాజాగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’,‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 5న విడుదల కానున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ విశేషాలను ఆమె ప్రేక్షకులతో పంచుకున్నారు. అవేంటో ఒకసారి చూసేద్దామా!

* తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన మరుసటి రోజు నుంచే రాజకీయం ఊపందుకుంది. కొత్త పొత్తులు, ఎత్తులు దిశగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. భాజపాతో దోస్తీతో ఎన్నికల బరిలోకి దిగుతున్న అన్నాడీఎంకే సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభించగా.. మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత, ప్రముఖ సినీ హీరో కమల్‌హాసన్‌ ఏఐఎస్‌ఎంకే చీఫ్‌, నటుడు శరత్‌ కుమార్‌, ఐజేకే నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.