Devotional

కాణిపాక వినాయకుడికి ప్రవాసుడి భారీ విరాళం-TNI ఆధ్యాత్మిక వార్తలు

కాణిపాక వినాయకుడికి ప్రవాసుడి భారీ విరాళం-TNI ఆధ్యాత్మిక వార్తలు

* ఎస్వీ గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ.10.10 లక్ష‌లు విరాళం.శ్రీ వేంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు శ‌నివారం రూ.10.10 ల‌క్షలు విరాళంగా అందింది.పాల‌కొల్లుకు చెందిన భ‌క్తుడు శ్రీ టి.కృష్ణ‌మూర్తి ఈ మేరకు విరాళం డిడిని తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డికి అంద‌జేశారు.ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, బోర్డు స‌భ్యుడు శ్రీ మొరంశెట్టి రాములు పాల్గొన్నారు.

* కాళేశ్వ‌రం త్రివేణిసంగ‌మంలో ఘనంగా మాఘపూర్ణిమ స్నానంటిటిడి త‌ల‌పెట్టిన మాఘమాస‌ మ‌హోత్స‌వంలో భాగంగా మాఘపూర్ణిమ‌ను పుర‌స్క‌రించుకుని శనివారం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వ‌రంలోని త్రివేణి సంగ‌మంలో మాఘపూర్ణిమ పుణ్య‌స్నానం కార్య‌క్ర‌మం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఉద‌యం 9 నుండి 11 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని కొలువుదీర్చి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన నిర్వహించారు.ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చంద‌నం, ప‌సుపు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో వేడుకగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వహించారు.

* రూ. 2937 . 82 కోట్లతో టీటీడీ బడ్జెట్ కు ఆమోదం.- ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి.- గోవును జాతీయ ప్రాణి గా గుర్తించాలని తీర్మానం.- టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్.టీటీడీ పాలకమండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి.

* వేంకటేశ్వరుడిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది.ఛైర్మన్‌ శివన్‌తో పాటు శాస్ర్తవేత్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. PSLVC51 నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు పొందారు.నమూనా ఉపగ్రహాన్ని మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయోగం విజయవంతం కావాలని పండితులు దీవెన.

* చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ప్రవాస భారతీయడు రూ.7కోట్ల విరాళం ఇచ్చారు. శనివారం ఉదయం ఆలయ ఈవో ఎ.వెంకటేశ్‌కు విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి రూ.8.75కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నిర్మాణ వ్యయం మొత్తాన్ని తానే ఇస్తానని ప్రవాసభారతీయుడు చెప్పారని, ఇందులో భాగంగా మొదటి విడతగా ఇవాళ రూ.7కోట్లు ఇచ్చారని ఈవో వెల్లడించారు. దాత, కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. విరాళం అందజేసిన ప్రవాస భారతీయుడు(ఎన్‌ఆర్‌ఐ) తన పేరు వెల్లడించేందుకు నిరాకరించారు.