‘‘కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను తీసుకొచ్చింది. అవి రైతులకు వరాలు కావు. మరణ శాసనాలు’’ అన్నారు ఆర్.నారాయణమూర్తి. ఇప్పుడాయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రైతన్న’. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, స్వామినాథన్ కమిటీ సిఫార్స్‌లను అమలు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం ‘ఈ చట్టానికి సవరణలు చేస్తాము కానీ రద్దు కుదరద’ని చెప్తోంది. కళాకారిడిగా కొత్త వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నేపథ్యంలో చేసిన చిత్రమే నా ‘రైతన్న’’ అన్నారు.
రైతన్నగా నారాయణమూర్తి
Related tags :