సాటి మనిషికి తోడ్పడం, వంద మందికి సాయపడకపోయినా ఒక్కరి జీవితంలోనైనా వెలుగులు నింపడం, మనవసేవే మాధవసేవ అనే నినాదాలను తాను గట్టిగా విశ్వసిస్తానని తానా 2021-23 ఎన్నికల్లో సామాజిక సేవా కార్యక్రమాల సమన్వయకర్త(Community Services Co-Ordinator) పదవికి పోటీపడుతున్న కసుకుర్తి రాజా అన్నారు. TNIతో మాట్లాడిన ఆయన తానా ద్వారా తను చేరుకోవాలనుకుంటున్న లక్ష్యాలు, తన భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారు. ఆ వివరాలు….
* నేను పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం. హైస్కూల్ వరకు నా విద్యాభ్యాసం వీరవల్లి ఉన్నత పాఠశాలలోనే జరిగింది. ఇంటర్మీడియెట్ విజయవాడలో, ఏలూరు సీ.ఆర్.రెడ్డి కళాశాలలో BSc ఎలక్ట్రానిక్స్, విజయవాడ సిద్ధార్థలో MSc ఎలక్ట్రానిక్స్ కోర్సులు పూర్తి చేశాను. అనంతరం 1999లో అమెరికాకు వచ్చిన నేను ప్రఖ్యాత ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన కొలంబియా నుండి MS డిగ్రీ అందుకున్నాను.
* 2014 నుండి తానా జీవిత కాల సభ్యుడిగా ఉన్న నేను 2015 డెట్రాయిట్ మహాసభల నుండి నా సమయాన్ని మరింతగా తానా సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాను.
* 2015 నుండి ఇప్పటి వరకు 10మందికి పేద విద్యార్థులకు ఇంజినీరింగ్, ఇంటర్మీడియట్ విద్యకు కావల్సిన ఫీజులు, ఇతర సామాగ్రిని సమకూర్చాను.
* 2017-19 మధ్య కాలంలో భారత్-అమెరికాల్లో తానా బ్యాక్‌ప్యాక్ కార్యక్రమాల ద్వారా వేలాది మంది పేదవిద్యార్థులకు బ్యాగులను, విద్యా సామాగ్రిని విజయవంతంగా అందజేశాము.
* 2018-19 మధ్యలో ఏపీ జన్మభూమి కార్యక్రమం కింద 50 డిజిటల్ తరగతులకు సొంత నిధులతో పాటు విరాళాలను సేకరించి అందజేశాను.
* 2017-19 మధ్య తానా వాలంటీరుగా 5కె రన్, సంక్రాంతి సంబరాలు, ఫాదర్స్ డే, న్యూయార్క్ క్రూయిజ్, క్యూరీ పోటీలు, ఆహార పంపిణీ తదితర కార్యక్రమాలను న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన బృందంలో సభ్యుడిగా ఉన్నాను.
* 2017-19 మధ్య మహిళలకు కుట్టుమెషీన్లు, రైతులకు కిట్లు, పవర్ స్ప్రేయర్లు తానా చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా అందజేశాను.
* 2019లో విజయవాడ చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని సమన్వయపరిచాను.
* 2019-21 కాలంలో న్యూజెర్సీ తానా ప్రాంతీయ ప్రతినిధిగా CPR కార్యక్రమాలు, యోగా, ధ్యానం, అష్టావధానం తదితర కార్యక్రమాలను నిర్వహించాను. తానా తరఫున ఆసు యంత్రాల పంపిణీకి $10వేల డాలర్లను సేకరించాను. ఔత్సాహికులైన స్థానిక యువతకు వాలీబాల్ పోటీలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాను.
* తెలుగు రాష్ట్రాల్లో కోవిద్ బారిన పడిన పేదలకు, న్యూజెర్సీ రాష్ట్ర అత్యవసర సేవల ఉద్యోగులకు నిత్యావసర సరుకులను అందజేశాను.
* వీటితో పాటు 500మంది పేద మహిళలకు చీరలు, దుప్పట్లు, 300మంది పోలీసులకు హెల్మెట్లు, 5500 మంది ప్రవాస చిన్నారులకు తానా వేసవి శిక్షణా తరగతులు, పలు సెమినార్లు, తానా బాలోత్సవం 2020 సమన్వయకర్తగా, వికలాంగులకు ట్రైసికిళ్లు, ఏపీలో 1000మందికి ఉచిత కంటి వైద్య శిబిరాలు తదితర సమాజ హిత కార్యక్రమాలను సొంత నిధులతో ఏర్పాటు చేశాను.
తానా ద్వారా తన సేవా కార్యక్రమాల పరిధిని మరింత విస్తరించాలని అనుకుంటున్నానని, తన లక్ష్యాలు, ప్రణాళికలు నిశితంగా పరిశీలించి తానా సభ్యులు తమ అమూల్యమైన ఓటును తనలాంటి సేవా తత్పరత ఉన్న అభ్యర్థులకు విరివిగా అందజేయాలని రాజా కసుకుర్తి కోరారు.
https://www.youtube.com/watch?v=N1zQmnv3qoU