తానా ఎన్నికల్లో కోశాధికారి పదవికి బరిలో ఉన్న ప్రవాస తెలుగు ప్రముఖుడు ప్రభల జగదీష్ TNIతో మాట్లాడారు. ఎన్.టీ.ఆర్ హయాంలో 1985లో ఏపీ సాంస్కృతిక శాఖ తరఫున సంగీత కళాకారిణి అయిన తన తల్లి ప్రభల అన్నపూర్ణతో కలిసి ఏడో తరగతి చదివే రోజుల్లో లాస్ఏంజిల్స్ తానాకు తను హాజరయ్యానని, సంస్థతో తనది విడదీయరాని అనుబంధమని పేర్కొన్నారు. తనను కోశాధికారిగా గెలిపించి తానా కార్యవర్గంలో అవకాశం కల్పిస్తే అమెరికా ఫెడరల్, రాష్ట్రాల నుండి సంస్థ సేవా కార్యక్రమాలకై నిధుల సేకరణకు కృషి చేస్తానని, సంస్థకు సంబంధించిన అన్ని ఆర్థికాంశాల్లో జవాబుదారీతనానికి, పారదర్శకతకు పెద్దపీట వేస్తానని తెలిపారు. 2008-09 నుండి తానా జీవితకాల సభ్యుడిగా ఉన్న జగదీష్, ఇప్పటివరకు నిర్వహించిన సేవా కార్యక్రమాలు, కోశాధికారిగా ఆయన లక్ష్యాలూను దిగువ పరిశీలించవచ్చు.
తానాతో నాది విడదీయరాని అనుబంధం-TNIతో ప్రభల జగదీష్
Related tags :