ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభ్యులకు ప్రస్తుతం ఉన్న సేవలను విస్తరించడంతో పాటు కొత్త సేవలను కూడా అందుబాటులోకి తీసుకువస్తానని సహాయ కార్యదర్శి పదవికి బరిలో ఉన్న టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌కు చెందిన తాళ్లూరి మురళీ TNIతో అన్నారు. తెలంగాణాలోని ఖమ్మం నుండి 2004లో ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వచ్చిన మురళీ తనను సహాయ కార్యదర్శిగా ఎన్నుకుంటే అధ్యక్ష కార్యదర్శుల సమన్వయంతో సభ్యుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లో ఉంచుతానని, పేదలకు ఉచితంగా భోజనం అందించే కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ న్యాయపరమైన మార్గనిర్దేశం, ప్రవాసులకు బీమా ఆవశ్యకత, టీం స్క్వేర్ బలోపేతం చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రవాసులకు తానాను దగ్గర చేస్తానని వెల్లడించారు. ఆయన తానాలో ఇప్పటివరకు నిర్వహించిన పదవులు, కార్యక్రమాల వివరాలను దిగువ పరిశీలించవచ్చు.
తానా సభ్యులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తా-TNIతో సహాయ కార్యదర్శి అభ్యర్థి తాళ్లూరి మురళీ
Related tags :